అఫీషియల్ : ‘మార్క్ ఆంటోనీ’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కోలీవుడ్‌లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ క్రిందటి నెలలో సెప్టెంబర్ 15న రిలీజైంది. భిన్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన సినిమా కావడం.. టీజర్, ట్రైలర్లు ఆసక్తిరేకెత్తించేలా ఉండటం.. అందరి దృష్టి దీనిపై పడింది. ఈ టైమ్ ట్రావెల్ సినిమా తమిళ,తెలుగులో ఒకే రోజు రిలీజైంది. తెలుగులో సోసో గా అనిపించుకున్న ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యి..వంద కోట్లు తెచ్చి పెట్టింది. తెలుగులో టాక్ బాగోకపోవటంతో చాలా మంది చూడలేదు. వారంతా ఇప్పుడు ఓటిటిలో చూడవచ్చు. మరో రెండు రోజుల్లో ఓటిటిలో వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
చిత్రం కథ:
మార్క్ (విశాల్)తండ్రి ఆంటోనీ (విశాల్) ఒకప్పుడు పెద్ద గ్యాంగస్టర్. అయితే ఓ గొడవలో చనిపోతాడు. దాంతో ఆంటోని క్లోజ్ ప్రెండ్ ఇంకో గ్యాంగస్టర్ అయిన ..జాకీ మార్తాండ (ఎస్.జె. సూర్య)..మార్క్ ని చేరతీసి పెంచుతూంటాడు. మార్క్...తండ్రిలా గ్యాంగస్టర్ కాకుండా ఓ మెకానిక్ అవుతాడు. అయితే మార్క్ కు ఓ పగ ఉంటుంది. తన తల్లిని చంపిన తండ్రిపై పీకల దాకా కోపం ఉంటుంది. కానీ చనిపోయిన తండ్రిని ఏమీ చెయ్యలేడు కదా. అయితే టైమ్ ట్రావెల్ అతనికి ఆ అవకాసం ఇస్తుంది. టైమ్ ట్రావెల్ ఫోన్ ద్వారా తన తండ్రిపై పగ తీర్చుకునే అవకాసం వస్తుంది. అయితే ఈ క్రమంలో తన తండ్రి గురించి షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏమిటి... ఫోన్ టైమ్ ట్రైవల్ కాన్సెప్టు ఏమిటి... తన తండ్రి ఆంటోనిపై పగ తీర్చుకున్నాడా .. ? ఈ కథలో సిల్క్ స్మిత, ఏకాంబరం (సునీల్), రమ్య (రీతూ వర్మ), వేదవల్లి (అభినయ) క్యారక్టర్స్ ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశాల్ మార్క్ యాక్షన్, ఎస్ జే సూర్య కామెడీ టైమింగ్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇలా అన్నీ కూడా ఆఢియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. విశాల్ ఈ సినిమా కోసం పాడిన పాట, జీవీ ప్రకాష్ అందించిన సంగీతం అందరినీ మెప్పించింది. ఇలా అన్నీ పాజిటివ్ అంశాలతో కూడుకున్న మార్క్ ఆంటోని ott లో బాగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. జాకీగా.. ఆయన తనయుడు మార్తాండ్‌గా ఎస్.జె.సూర్య కూడా రెండు పాత్రల్లో సందడి చేశారు. అద్విక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టాలీవుడ్ యాక్టర్స్ సునీల్,రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు.