తమిళ స్టార్ హీరో విశాల్ ఆఫీస్‌లో 45 లక్షలకు పైగా గోల్ మాల్ జరగటంతో ఆఫీస్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిపై విశాల్‌ పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల జీతాల నుంచి కట్‌ చేసిన టీడీఎస్‌ను ప్రభుత్వానికి చెల్లించకుండా తన సొంత అకౌంట్‌లో జమ చేసుకున్నట్టుగా రమ్య అనే ఉద్యోగి మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం ఉద్యోగి రమ్య స్పందించింది. పైకి హీరోలా కనిపించే విశాల్‌, వాస్తవానికి పెద్ద విలన్‌ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ ఆమె వెల్లడించింది. తాజాగా మీడియాకు ముందుకు వచ్చిన రమ్య.. విశాల్ ముసుగు తీసి అసలు రూపం ప్రపంచానికి చూపిస్తానంటూ హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రమ్య వ్యాఖ్యలు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

విశాల్ ప్రస్తుతం చక్ర, తుప్పరివాలన్‌ 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన చక్ర ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ఎంఎస్‌ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విశాల్ తరుచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. నడిగర్ సంఘం ఎన్నికల నుంచి విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాడు.