తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన అనీషా 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. ఇటీవల వీరిద్దరికీ హైదరాబాద్ లో నిశ్చితార్ధం కూడా జరిగింది.  

అయితే ఈ కార్యక్రమం అతి తక్కువమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. అక్టోబర్ 9న వివాహానికి ముహూర్తం కూడా పెట్టారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్నట్లు సమాచారం. అనీషా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన నిశ్చితార్ధం ఫోటోలు, విశాల్ కి సంబంధించిన ఫోటోలు తరచూ పోస్ట్ చేసేది. విశాల్ కూడా ట్విట్టర్ లో ఫోటోలు షేర్ చేసేవారు. ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్ట్ లు పెట్టే అనీషా సడెన్ గా తన నిశ్చితార్ధపు ఫొటోలన్నీ తొలగించింది.

అలానే విశాల్ ఫోటోలను కూడా డిలీట్ చేసింది. ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం బయటకి రానప్పటికీ అనీషా మాత్రం పెళ్లి బ్రేక్ చేసుకోవాలని నిర్ణయించుకుందని టాక్. కానీ విశాల్ మాత్రం ఆమెను ఒప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. మరేం జరుగుతుందో చూడాలి!