Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి విశాల్‌ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరో.. చివర్లో ట్విస్ట్..

దళపతి విజయ్ లాగే విశాల్‌ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో తాజాగా విశాల్‌ స్పందించారు. పొలిటికల్‌ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

vishal clarity on he enter into politics arj
Author
First Published Feb 7, 2024, 5:47 PM IST

హీరో విశాల్‌.. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. చాలా వేగంగా మూవీస్‌ చేస్తూ రాణిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన ప్రతి సినిమా తెలుగులో ఏక కాలంలో విడుదలవుతుంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల విశాల్‌ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగింది. తమిళ హీరో విజయ్‌ రాజకీయ ఎంట్రీని ప్రకటించిన నేపథ్యంలో విశాల్ కూడా ఆయన దారిలోనే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు. వచ్చే తమిళనాడు సాధారణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై విశాల్‌ స్పందించారు. రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా వార్తల నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు. డైరెక్టర్‌గా ఆ విషయాన్ని చెప్పకుండా పరోక్షంగా తాను సినిమాల్లోనే కొనసాగుతానని, ఎప్పటిలాగే తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. చాలా తెలివిగా ఆయన ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం. 

ఇందులో విశాల్‌ చెబుతూ, నటుడిగా, సామాజిక సేవకుడిగా నాకు హోదాని, గుర్తింపు, ప్రశంసలను అందించిన తమిళనాడు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా ఏళ్లుగా సమాజంలో నేను మీలో ఒకడిగా ఉన్నాను. నేను చేయగలిగినంత సహాయం చేయాలనే లక్ష్యంతో, మొదటి నుంచి నా అభిమానుల సంఘాన్ని సాధారణ అభిమానుల సంఘంలా పరిగణించలేదు. ప్రజలకు మంచి చేసే వేదికగా భావించాను. కాబట్టి మేం దీనికి ఒక స్వచ్ఛం సంక్షేమ ఉద్యంగా అమలు చేశాం. లేని వారి కోసం మా వంతు కృషి చేస్తున్నాం. 

మున్ముందు కూడా ప్రజల ప్రగతి కోసం, జిల్లాల వారీగా, మండలాల వారీగా శాఖల వారీగా ప్రజల సంక్షేమ కోసం కృషి చేసేందుకు `మక్కల్‌ నా ఇయక్కం` సంస్థని రూపొందించాం. అలానే మా అమ్మ పేరు మీద స్థాపించిన `దేవి ఫౌండేషన్‌` ద్వారా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు మీద ప్రతి ఏడాది చాలా మంది టాలెంట్‌ ఉన్న నిరుపేద విద్యార్థులకు విద్యని అందించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే తమిళనాడులోని ప్రతి జిల్లాలో రైతులకు మా వంతు సహాయాన్ని అందిస్తున్నాం. 

అంతేకాకుండా నా సినిమా షూటింగ్‌ కోసం నేను ఏగ్రామం, పట్టణం, సిటీకి వెళ్లినా, ఆ ప్రాంతంలోని వ్యక్తులను క్రమం తప్పకుండా కలుసుకుంటూ, వారి సమస్యలను, ఫిర్యాదులను వింటున్నాను. దాని ద్వారా `మక్కల్‌ నల ఇయక్కం` ద్వారా నా తోటి సహచరుల ద్వారా వారి ప్రాథమిక అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.

ఇన్నాళ్లూ నేను రాజకీయ లబ్డిని ఆశించి పేర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను ఎప్పుడూ చేయలేదు. గ్రేట్‌ వల్లువర్‌ ఉల్లేఖించినట్టుగా వారికి నావంతు సహాయం చేస్తూనే ఉంటాను. మానసికంగా ఇది నా కర్తవ్యంగా భావిస్తున్నా. నా `మక్కల్‌ నల ఇయక్కం` ద్వారా నా రాష్ట్ర ప్రజలకు నా సామాజిక సేవను కొనసాగిస్తాను. రాబోయే భవిష్యత్‌ కాలంలో విధి ఏదైనా మార్పు తెచ్చి నన్ను చేరదీయడానికి, పేదల కోసం పనిచేసేలా చేస్తే, నేను వారిలో ఒకరిగా ప్రజల కోసం మాట్లాడటానికి, పనిచేయడానికి వెనకాడను` అని తెలిపారు విశాల్‌. 

ప్రస్తుతానికి తాను రాజకీయాల్లోకి వెళ్లడం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అదే సమయంలో భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వెళ్లొచ్చనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.  ప్రస్తుతం విశాల్‌ `రత్నం` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు `తుప్పరివాలన్‌2`లో నటిస్తున్నారు.  

read more: విజయ్ బాటలో విశాల్.. తమిళ హీరో సంచలన నిర్ణయం, త్వరలో ప్రకటన..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios