Asianet News TeluguAsianet News Telugu

Enemy OTT: విశాల్ 'ఎనిమీ' ఓటిటి రిలీజ్ డేట్

పాట‌లు,ట్రైలర్స్ ఇంట్రస్టింగ్ గా  ఉండ‌టంతో  సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది? అంటే ఆ స్దాయిలో  అందుకోలేదనే చెప్పాలి.  ఇప్పుడీ ఎనిమీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

 

Vishal & Arya Enemy OTT Platform Locked
Author
Hyderabad, First Published Jan 25, 2022, 10:48 AM IST


మొన్న దీపావ‌ళి బ‌రిలో డబ్బింగ్ చిత్రాల జోరు క‌నిపించింది. ర‌జ‌నీకాంత్ ‘పెద్ద‌న్న’అంటూ పండ‌గ బ‌రిలో దిగ‌గా.. ఆయ‌న‌కు పోటీగా ‘ఎనిమి’(Enemy)తో రేసులోకి దిగారు విశాల్‌(vishal), ఆర్య‌(arya). ‘వాడు వీడు’ త‌ర్వాత  ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించిన రెండో చిత్ర‌మిది. విభిన్న‌మైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా అంటూ ప్రమోట్ చేసారు.  పాట‌లు,ట్రైలర్స్ ఇంట్రస్టింగ్ గా  ఉండ‌టంతో  సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది? అంటే ఆ స్దాయిలో  అందుకోలేదనే చెప్పాలి.  ఇప్పుడీ ఎనిమీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఈ చిత్రం ఓటీటి రైట్స్ ని SonyLIV సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఓటీటి ప్రీమియర్ స్ట్రీమింగ్ ..ఫిబ్రవరి మొదటి వారంలో జరగనుందని సమాచారం. తెలుగు,తమిళ వెర్షన్స్ రెండింటిలోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

తమిళంలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న ఎనిమికి ఇక్కడ జస్ట్ ఓకే అనే టాక్ వచ్చింది.  సాధారణం గా అయితే విశాల్ సినిమాలు యావరేజ్ టాక్ దక్కించుకుంటే ఫ్లాఫ్ క్రింద లెక్కే. పెద్దగా వసూళ్లు ఉండవు. కాని బాక్సాఫీస్ వద్ద మొత్తం మూడు విడుదల అవ్వగా ఆ రెండు అట్టప్ ప్లాప్ అనిపించుకోవడంతో మిగిలి ఉన్న ఒక్క సినిమా ఎనిమీ పర్వాలేదు అనే టాక్ ను దక్కించుకుంది కనుక వసూళ్లు అటు వైపు ఫరవాలేదన్నట్లుగా ఉంటున్నాయని ట్రేడ్ అంటోంది. దాంతో దీపావళి వీక్ లో విడుదల అయిన సినిమాల్లో మెజార్టీ వసూళ్ల వాటను ఎనిమీ దక్కించుకున్నట్లు అయ్యింది.

మరో ప్రక్క రజినీకాంత్ నటించిన పెద్దన్న సినిమా మొదటి రెండు రోజులు హంగామా చేసినా ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దాంతో ఎనిమీ సినిమా కు కలిసి వచ్చి వసూళ్ల పంట పండించుకుంది. తెలుగు రైట్స్ ను దక్కించుకున్న వారికి బ్రేక్ ఈవెన్ లభించింద అంటున్నారు. విశాల్ సినిమాలు గతంలో తెలుగు లో మంచి వసూళ్లను దక్కించుకున్నాయి. వాటితో పోల్చితే ఈ సినిమా వసూళ్లు తక్కువే అయినా కూడా దీపావళికి విడుదల అయిన ఇతర రెండు సినిమాలతో పోల్చితే మాత్రం ఎనిమీది పై చేయి అయినట్లే అంటున్నారు. మరి ఓటిటిలో ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios