Asianet News TeluguAsianet News Telugu

టీజర్: వాడు చైతన్య నేను సమంత! ఇదో వర్జిన్ స్టోరి

విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

Virgin Story telugu Movie Trailer released
Author
Hyderabad, First Published Nov 1, 2021, 8:11 AM IST

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ కుమారుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా 'వర్జిన్ స్టోరీ'. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి  చిత్రాల్లో నటించిన విక్రమ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న 'రౌడీ బాయ్స్' లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో విక్రమ్ హీరోగా చేస్తున్న తొలి చిత్రం 'వర్జిన్ స్టోరీ'. కొత్తగా రెక్కలొచ్చెనా... అనేది ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి 'వర్జిన్ స్టోరీ' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజైంది. టీజర్ హాట్ హాట్ గా నడిచింది. 

ఈ టీజర్ లో కొన్ని డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటీల్లో హీరో హీరోయిన్ ప్రైవసీ వెతుకుతూ గెస్ట్ హౌస్ లలో తమను తాము పరిచయం చేసుకుంటూ నాగచైతన్య- సమంత. .. విరాట్ - అనుష్క అంటూ ఫన్ ని క్రియేట్ చేయడం బాగుంది.  స్కూల్ కాలేజ్ యూత్ ని థియేటర్లకు రప్పించే కంటెంట్ టీజర్ లో కనిపిస్తోంది. విక్రమ్ సహిదేవ్.. అంతగా మెచ్యూర్ కాని టీనేజర్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. సౌమిక పాండియన్ గ్లామర్ అదిరింది.  

దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ... దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందుతుంటానని వెల్లడించారు. 'వర్జిన్ స్టోరీ' సినిమాను తన జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించినట్టు తెలిపారు. "విక్రమ్ లాంటి కసి ఉన్న నటుడు నా మొదటి సినిమాకు హీరోగా దొరకడం అదృష్టం. ప్రతి సీన్ కు సాధన చేసేవాడు. తన పూర్తి ప్రయత్నంతో నటించేవాడు. విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుంది" అన్నారు.

టీజర్ రిలీజ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…శ్రీధర్ నాకు చాలా కాలంగా స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమాలంటే ఇష్టం. నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్ తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. వర్జిన్ స్టోరి టీజర్.. పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరి సినిమా నచ్చుతుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్... అన్నారు. 

Also read Bigg boss telugu5: హౌస్ నుండి లోబో అవుట్..!

విక్రమ్, సౌమిక, పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి, సినిమాటోగ్రఫీ అనీష్ తరుణ్ కుమార్ అందిస్తున్నారు. ఎడిటింగ్... గ్యారీ, సాహిత్యం భాస్కర భట్ల, అనంత్ శ్రీరామ్ అందిస్తున్నారు. వర్జిన్ స్టోరీ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాఘవేంద్ర వ్యవహరిస్తున్నారు.

Also read బ్రేకింగ్: కావేరి హాస్పిటల్ నుండి రజినీకాంత్ డిశ్చార్జ్
 

Follow Us:
Download App:
  • android
  • ios