`విరాటపర్వం` యూనిట్‌లోనూ జోష్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన వరుస అప్‌డేట్లు ఇస్తున్నారు. రేపు(సోమవారం) మరో సర్‌ప్రైజ్‌ ఈ చిత్రం నుంచి వదలబోతున్నారు. 

సాయిపల్లవి(Sai Pallavi) మరోసారి తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. చివరగా ఆమె `శ్యామ్‌ సింగరాయ్‌`లో మెరవగా ఇప్పుడు `విరాటపర్వం`)VirataParvam)తో రాబోతుంది. రానా హీరోగా నటించిన చిత్రమిది. వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. ఇప్పటి వరకు సినిమా రిలీజ్‌ ఎప్పుడనే సస్పెన్స్ నెలకొంది. దాన్ని బ్రేక్‌ చేస్తూ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్.

దీంతో `విరాటపర్వం` యూనిట్‌లోనూ జోష్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన వరుస అప్‌డేట్లు ఇస్తున్నారు. రేపు(సోమవారం) మరో సర్‌ప్రైజ్‌ ఈ చిత్రం నుంచి వదల బోతున్నారు. ముఖ్యంగా సాయిపల్లవి ఫ్యాన్స్ ని ఖుషీ చేసే న్యూస్‌ వెల్లడించారు. ఇందులో `సోల్‌ ఆఫ్‌ వెన్నెల` పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నారు. వెన్నెల పాత్రలోని సోల్‌ని ఈ వీడియోలో చూపించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే సాయిపల్లవి పాత్రలోని ఆత్మని ఆవిష్కరించబోతున్నారని చెప్పొచ్చు. అయితే `వెన్నెల రెండు సార్లుజన్మించింది` అంటూ దర్శకుడు చేసిన పోస్ట్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంచనాలను పెంచుతుంది. సోమవారం ఉదయం 11.07గంటలకు `సోల్‌ ఆఫ్‌ వెన్నెల`ని విడుదల చేయబోతున్నారు. 

Scroll to load tweet…

ఇక ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుండగా, విప్లవ నాయకుడు, నక్సలైట్‌ రవన్న అలియాస్‌ డాక్టర్‌ రవిశంకర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు దర్శకుడు వేణు ఉడుగుల. నక్సల్‌ పోరాటం, విప్లవ భావాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు 1990లో ఎలా ఉండేవి, తమకు, పేద ప్రజలకు జరిగిన అన్యాయాలపై రవన్న చేసిన పోరాటాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ సినిమాలపై అంచనాలను పెంచాయి. ఇందులో ప్రియమణి, నివేతా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.