భారత క్రికెట్ టీం సారధి ప్రపంచ బెస్ట్ బ్యాట్స్‌మెన్స్‌లో ఒకడైన విరాట్‌ కోహ్లీకి సంబందించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా విరాట్‌ చిన్నతనానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్ చేశాడు అతని స్నేహితుడు. స్కూల్ డేస్‌తో విరాట్ స్లామ్‌ బుక్‌లో తనకు ఎంతో నచ్చిన హీరో హృతిక్ రోషన్‌ రాశాడు.

విరాట్‌ చిన్ననాటి స్నేహితుడు షలాజ్‌ సోందీ స్లామ్‌ బుక్‌లోని విరాట్‌ పేజ్‌ ఫిల్ చేసిన పేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోతో పాటు `చూడండి.. సోదరా విరాట్‌ కోహ్లీ మన పాత జ్ఞాపకం` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ పోస్ట్‌కు సమాధానంగా ఓ వ్యక్తి హృతిక్ అంటూ హృతిక్‌ రోషనా అంటూ ప్రశ్నించగా, అవునంటూ సమాధానం ఇచ్చాడు షలాజ్‌.

దీంతో ఇండియన్‌ కెప్టెన్‌ కూడా హృతిక్‌కు ఫ్యాన్ బాయ్ అంటూ సంబర పడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ పోస్ట్‌ను హృతిక్ అభిమానులతో పాటు విరాట్‌ అభిమానులు కూడా ఓ రేంజ్‌లో వైరల్‌ చేస్తున్నారు. బాలీవుడ్ హ్యాండ్సమ్‌ హీరో హృతిక్‌కు ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు ఆయన అభిమానుల లిస్ట్‌ లో చాలా మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

హృతిక్ అభిమానుల జాబితాలో టాప్ స్టార్స్‌ కూడా ఉన్న విషయం ఒక్కొక్కోటి బయటకు వస్తుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందరిలోకి విరాటే బిగ్గెస్ట్ స్టార్‌ అంటున్నారు ఫ్యాన్స్‌.