Asianet News TeluguAsianet News Telugu

అనుష్క హై హీల్స్ పై కోహ్లీ సెటైర్, కోపంతో చిన్నపిల్లల చేష్టలన్న అనుష్క.. వాళ్ళ ఫస్ట్ మీటింగ్ డిటైల్స్

ఇటీవల దినేష్ కార్తీక్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీని అనుష్కను మొదటిసారి ఎక్కడ కలిశాడో, అప్పుడు ఏమి జరిగిందో వివరించాడు. 

virat kohli reveals when he first met with his wife anushka sharma
Author
Hyderabad, First Published Aug 7, 2021, 3:14 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్ వైరల్ కోహ్లీ, అనుష్క శర్మల ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ కమర్షియల్ యాడ్ కోసం కలిసిన వీళ్ళిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక 2021 జనవరిలో అనుష్క అమ్మాయికి జన్మనివ్వగా, వామిక అని పేరు పెట్టారు. 


అయితే ఇటీవల దినేష్ కార్తీక్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విరాట్ కోహ్లీని అనుష్కను మొదటిసారి ఎక్కడ కలిశాడో, అప్పుడు ఏమి జరిగిందో వివరించాడు. ఫ్రెండ్స్ తో జోక్స్ వేస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో అనుష్క అటువైపుగా వచ్చారట అనుష్క. ఆమె ధరించిన హై హీల్స్ చూసిన విరాట్.. ఇంత కంటే ఎత్తైన చెప్పులు మీకు దొరకలేదా.. అంటూ కామెంట్ చేశాడట. విరాట్ కామెంట్ అనుష్క శర్మకు కోపం తెప్పించిందట. 


విరాట్ కామెంట్ కి సమాధానంగా.. నేనేమి ఆరడుగులు లేను, అందుకే హై హీల్స్ వేసుకున్నా.. అంటూ సమాధానం చెప్పిందట. అంతటితో ఆగకుండా, చుట్టూ వున్న వ్యక్తులపై జోక్స్ వేస్తున్న ఇతనిని చూస్తుంటే చిన్నపిల్లాడు అనిపిస్తున్నాడు.. అని అన్నారట. ఆ సమయంలోనే అనుష్కపై ప్రత్యేకమైన ఆకర్షణ కలిగినట్లు విరాట్ తెలిపారు. ఇక తన జీవితంలోకి వామిక రావడం గొప్ప విషయంగా కోహ్లీ అభివర్ణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios