టాలీవుడ్ లో గత ఏడాది శ్రీ రెడ్డి టాపిక్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అభిరామ్ పై వచ్చిన ఆరోపణలు అందరిని షాక్ కి గురి చేశాయి. అయితే ప్రస్తుతం మరోసారి పలు వార్తలతో దగ్గుబాటి అభిరామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రీసెంట్ గా సమంత ఓ బేబీ ప్రమోషన్స్ అభిరామ్ బాగానే హడావుడి చేశాడు. 

ఇక ఆ వివాదాలను పక్కనపెడితే ఈ అప్ కమింగ్ హీరో మొదటి సినిమాకు సంబందించిన మరికొన్ని రూమర్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అసలైతే గతంలోనే పలు కథలను సెట్స్ పైకి తెచ్చిన తండ్రి సురేష్ బాబు ఎందుకోగానీ వాటిని మొదట్లోనే ఆపేశాడు. ఇక రీసెంట్ గా యాక్టింగ్ కి సంబందించిన శిక్షణను అభిరామ్ పూర్తీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

రెడీగా ఉన్న రెండు కథలపై ప్రముఖ దర్శకులతో చర్చించి అభిరామ్ కు సెట్టయ్యే స్క్రిప్ట్ ను ఫైనల్ చేయాలనీ సురేష్ బాబు ఆలోచిస్తున్నాడట. రొమాంటిక్ అండ్ క్యూట్ లవ్ స్టోరిలో అభిరామ్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా అభిరామ్ మొదటి ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని సురేష్ ప్రొడక్షన్స్ ప్రయత్నాలు చేస్తోంది.