Ennenno Janmala Bandham: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ రేటింగ్ తో ముందుకి దూసుకుపోతుంది. ఒప్పందం మీద పెళ్లి చేసుకున్న ఓ భార్య భర్తల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో కాఫీ ఇస్తున్న భార్యని ఏంటి స్పెషల్ స్పెషల్ గా కనిపిస్తున్నావ్ అని అడుగుతాడు యష్. ఏం లేదు, కానీ నేను ఒకటి అడుగుతాను మీరు నో అనకూడదు అంటుంది వేద. ఏంటో అడుగు అంటాడు యష్. ఈరోజు ఆఫీస్ కి వెళ్లొద్దు అంటుంది వేద. ఈరోజు ఆఫీస్ లో నాకు చాలా పనులు ఉన్నాయి నేను చాలా బిజీ అంటాడు యష్. ఆ మాటలకి మొహం చిన్నబుచ్చుకుంటుంది వేద.

భార్యని అలా చూసి నవ్వుకుంటూ అయినా పర్వాలేదు నీకోసం పనులన్నీ పక్కన పెట్టి ఆఫీస్ మానేస్తాను అంటాడు యష్. ఏమీ లేదు మా అమ్మ ఈరోజు మన ఇద్దరి పేరు మీద పూజ చేస్తుంది. నేను మిమ్మల్ని తులాభారం వేస్తాను అంటుంది వేద. మనం ఇద్దరమే ఈ పూజలో పాల్గొనాలి. ఎందుకంటే మా అమ్మ సంతోషం కోసం అంటుంది వేద. నన్ను కాక పట్టింది ఇందుకోసమా అని నవ్వుతాడు యష్.

మీకు ఓకే కదా అంటుంది వేద. ఈ చిటికెన వేలు పట్టుకొని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు ఐ యాం యువర్ వినయ విధేయ రామ అని డ్రమెటిగ్గా మాట్లాడుతాడు యష్. మా మంచి శ్రీవారు అంటూ ఆనందపడుతూ ఈ విషయాన్ని అమ్మకు చెప్తాను అంటూ వెళ్ళిపోతుంది వేద. భర్త అనేవాడు భార్య చిన్నచిన్న సరదాలని తీర్చాలి కానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టలేదు ఏంటి అనుకుంటాడు యష్.

మరోవైపు మనవరాలికి ముద్దపప్పుతో అన్నం తినిపిస్తుంటుంది సులోచన. మా ఐటమ్స్ లేవా అంటుంది ఖుషీ. మీ ఐటమ్స్ ఏంటి అంటుంది సులోచన. చికెన్ కర్రీ, మటన్ పులుసు అంటుంది ఖుషీ. మనం శుద్ధ శాఖాహారులోని అలాంటివి తినకూడదు అంటుంది సులోచన. అందుకే మా నాన్నమ్మ నిన్ను ముద్దపప్పు అంటుంది అంటూ చిరాకు పడుతుంది ఖుషి. ఆ మాటలకి శర్మ నవ్వుతుంటాడు.

మీ నానమ్మ ఊరు నుంచి వచ్చాక మీ వంటకాలు అన్ని చేయించుకుందువు గానివి కానీ ఇక్కడ ఉండేటప్పుడు అగ్రహారపు ఆడపిల్లలాగే తినాలి అంటుంది సులోచన. అంతలోనే వేద వచ్చి గుడికి రావడానికి ఆయన ఒప్పుకున్నారు అంటుంది వేద. అందుకు సంతోషిస్తారు సులోచన దంపతులు. మరోవైపు అందరూ గుడికి వెళ్తారు మా డాడీ తులాభారం సక్సెస్ అవ్వాలి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటుంది ఖుషి.

తర్వాత గంట కొట్టడానికి ప్రయత్నిస్తుంది. గంట అందకపోవటంతో వేద దంపతులు ఇద్దరు ఆమెని ఎత్తుకుంటారు. అమ్మ నాన్నమ్మ చూడండి నేను ఎంత పెద్ద దాన్ని అయిపోయాను ఇప్పుడు గంట కూడా కొడతాను అంటూ ఆనందంగా చెప్తుంది ఖుషి. ఖుషి ఎంత ఎత్తు ఎదిగిపోయిందో అంటూ ఖుషిని మరింత ఆనంద పరుస్తుంది సులోచన. తనదంతా నా పోలికే అంటుంది మాలిని.

మళ్లీ ఇద్దరూ తగదా పెట్టుకుంటారు మాలిని, సులోచన. ఊర్లో కూడా మొదలు పెట్టేసారు అంటుంది చిత్ర. అది వాళ్లకి మనకి కూడా అలవాటైపోయింది అంటుంది వేద. అందరూ నవ్వుకుంటారు. తర్వాత పూజ చేస్తారు పంతులుగారు. ఈరోజు కృష్ణ పక్షంలో మొదటి రోజు కృష్ణుడికి ఇష్టమైన రోజు. నీ భర్త తులాభారంలో తూగాలని ఈ బంగారానికి పూజ చేయు అని బెల్లం దిమ్మలకి పూజ చేయిస్తారు పంతులుగారు. ఆమెని అలా చూస్తూ ఉండిపోతాడు విన్ని.

మా మధ్య ఎలాంటి విభేదాలు రాకూడదని చిత్ర వాళ్లు కూడా దండం పెట్టుకుంటారు. అప్పుడే వెళ్లి వచ్చి అందర్నీ పలకరిస్తాడు. ఈ బట్టల్లో మెరిసిపోతున్నారు. నా దృష్టి తగిలేటట్లుగా ఉంది అయినా ఈ తులాభారం ఏంటో, ఎలా వేస్తారో అని ఎప్పుడెప్పుడు చూస్తానో అని ఉంది అంటాడు విన్ని. అంతా ఆత్రం ఎందుకు ఐదు నిమిషాల్లో ప్రారంభం అవుతుంది చూద్దువు గానివి నీకు కూడా ఏమైనా తీరని కోరికలు ఉంటే కోరుకో నీకు కూడా తులాభారం వేస్తాం అంటుంది సులోచన.

అయితే ప్లాన్ చేయాల్సిందే ఎందుకంటే నాకు తీరని ఒక పెద్ద కోరిక ఉంది అంటూ వేద వైపు చూస్తాడు విన్ని. అదేంటి అంత పెద్ద కోరిక అంటుంది వేద చెప్తే కోరిక తీరదంట కదా, తీరిన వెంటనే ముందు నీకే తెలుస్తుంది అంటాడు విన్ని. అయితే మంచి రోజు చూసుకుని నీకు కూడా తులాభారం వేద్దాం అంటుంది సులోచన. అందరూ ఆనందంగా తులాభారం వైపు వెళ్తారు.

నందు మాత్రం నువ్వు నాతో రావాలని నా కోరిక తీరాలి అంటే ఇప్పుడు నీ కోరిక తీరకూడదు, అంటే ఈ తులాభారం జరగకూడదు, జరగనివ్వను అనుకుంటాడు విన్ని. మరోవైపు అక్క బావలని చూస్తుంటే సీతారాముల్లాగా చూడవచ్చుగా ఉన్నారు అంటుంది చిత్ర. గొడవలతో ప్రారంభమైన వాళ్ళ జీవితం ఇంత ఆనందకరంగా మారుతుందని నేను ఊహించలేదు. వాళ్ళిద్దర్నీ ఇలా చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటాడు వసంత్.

మరోవైపు భర్త అడుగులో అడుగు వేస్తూ భర్తని చూస్తూ మురిసిపోతుంటుంది వేద. గుడిలో వ్యూ చాలా బాగుంది కదా అంటాడు యష్. అంతలోనే చిత్ర వాళ్లు కాయిన్ నిలబెట్టి సక్సెస్ అయింది అని సంతోష పడతారు. అప్పుడే వచ్చిన వేద ఇదేంటి అని అడుగుతుంది. అలా నిలబెడితే మనసులో ఉన్న కోరికలు తీరతాయంట మీరు కూడా ట్రై చేయండి అంటుంది చిత్ర.

యష్ దగ్గర కాయిన్ తీసుకొని నా మనసులో ఉన్న ప్రేమని ఆయనకి చెప్పాలనుకుంటున్నాను ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అని కాయిన్ నిలబడుతుంది వేద. కానీ రెండుసార్లు కాయిన్ పడిపోతుంది. నా భక్తిలో ఏదైనా లోపం ఉందా అని కంగారు పడిపోతుంది వేద. ఇదంతా గమనిస్తున్న విన్నీ ఆ కాయిన్ నిలబడదు, మీ ఇద్దరి బంధము నిలబడదు ఈ వివిన్ ఎంట్రీ ఇచ్చాక ఆ యశోద ఎగ్జిట్ అవ్వాల్సిందే అనుకుంటాడు.

తరువాయి భాగంలో భర్తని తులాభారం వేస్తుంది వేద. ఈ తులాభారం జరగకూడదు, మీ బంధం నిలబడకూడదు అని నవ్వుకుంటాడు విన్ని. త్రాసు ఎంతకీ పైకి లేవదు. నువ్వు ఎంతసేపు కూర్చున్నా శుద్ధ దండగ అంటారు పంతులుగారు. ఒక్కసారిగా షాక్ అవుతారు వేద దంపతులు.