దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన సీనియర్ దర్శకుడు వినాయక్ తన సినిమాల్లో ఒక్కో హీరోని ఒక్కో స్టైల్ లో చూపించాడు. హీరోల రేంజ్ కి తగ్గట్టు తన మేకింగ్ స్టైల్ ని చూపించే వినాయక్ మొదటిసారి తన లుక్ లో ఊహించని మార్పు చూపించాడు. ఎదో గెస్ట్ రోల్స్ లో దర్శకులు కనిపిస్తున్నారు అంటే కామన్.

కానీ ఒక ప్రొఫెషినల్ యాక్టర్ గా వినాయక్ కష్టపడుతుండడం విశేషం. సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన వినాయక్ సినీ స్టార్స్ ని ఆశ్చర్యపరిచాడు. ఎవరు ఊహించని విధంగా సరికొత్త ఫిట్ నెస్ తో పాటు   హెయిర్ స్టైల్ ని కూడా చేంజ్ చేశాడు. మొత్తానికి కథానాయకుడిగా వినాయక్ ఒక కొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు చెప్పవచ్చు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న వినాయక్ మూవీ ఈ ఏడాది ఎండింగ్ లో మొదలుకానుంది. 

ఇక సినిమా లాంచ్ ఈవెంట్ కి డేట్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 9న వినాయక్ బర్త్ డే సందర్భంగా లాంచ్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కథ 1980కాలంలో సాగే ఒక పిరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. ఇక కథకు తగ్గట్టుగా వినాయక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడట.