'వినయ విధేయ రామ' సినిమా కాంట్రవర్సీ జరుగుతూనే ఉంది. దర్శకుడు బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ లో ఐదు కోట్లు తిరిగివ్వాలని నిర్మాత దానయ్య పట్టుబట్టి కూర్చున్నాడు. బోయపాటి కూడా దానికి తగ్గట్లే డబ్బు ఇవ్వనని గొడవ చేస్తున్నాడు.

ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. పైగా 'వినయ విధేయ రామ' సినిమా ఫ్లాప్ కాదని, అది హిట్టు సినిమా అంటూ వాదిస్తున్నాడట. దీంతో ఈ గొడవ సెటిల్ చేద్దామని వచ్చిన ఇండస్ట్రీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారట.

'నేను హిట్టు సినిమా తీశాను. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కావాలని సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేస్తున్నారు' అంటూ బోయపాటి అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడట. అసలు చరణ్ తన అనుమతి తీసుకోకుండా సినిమా ఫ్లాప్ అని ఫ్యాన్స్ కి లెటర్ ఎలా రాస్తాడంటూ ప్రశ్నిస్తున్నాడట. సినిమా ఫ్లాప్ అయితే దర్శకులు తిరిగి డబ్బు ఇవ్వాలని ఎక్కడా లేదని అంటున్నాడట.

విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఇక్కడ డబ్బు కంటే ఒకరిపై మరొకరికి ఉన్న ఈగోలే గొడవని పెద్దది చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బు రాబట్టాలని నిర్మాత దానయ్య.. ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని బోయపాటి ఇద్దరూ  మొండిపట్టు పట్టారు. మరి ఈ గొడవ ఎప్పటికి సద్దుమణుగుతుందో!