Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ క్రేజ్.. ఎన్టీఆర్, మహేష్ లకు మించి!

దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వినయ విధేయ రామ'. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అలానే ఓ ఫ్యామిలీ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

vinaya vidheya rama creating records
Author
Hyderabad, First Published Dec 14, 2018, 1:36 PM IST

దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వినయ విధేయ రామ'. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అలానే ఓ ఫ్యామిలీ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. 

వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెలలోనే జరపనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినిమా థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం కోసం బయ్యర్ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది. 

నైజాంలో సినిమా హక్కులు రూ.24 కోట్లకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకి అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా హిందీ హక్కులు రూ.22 కోట్లు పలికాయి.

ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.18 కి అమ్మగా, మహేష్ లేటెస్ట్ సినిమా 'మహర్షి' రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' హిందీ డబ్బింగ్ రైట్స్ ఎన్టీఆర్, మహేష్ సినిమాల కంటే అత్యధికంగా రూ.22 కోట్లు పలుకుతున్నాయి. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో  కనిపించనున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios