ఇండస్ట్రీలో ఎన్నో గొడవలు జరుగుతూంటాయి. అంతర్గతంగా ఎన్నో సెటిల్మెంట్స్ జరుగుతూంటాయి. కానీ ఎవరూ కూడా మీడియా ముందుకు రావటానికి ఇష్టపడరు. అక్కడిక్కడే తిట్టుకుంటారు..అరుచుకుంటారు..పైకి ఏమీ జరగనట్లుగా నటిస్తూ తమ పని తాము చేసుకుపోతూంటారు. ఇది ఇండస్ట్రీ లో అందరూ అనుసరించే కనపడని రూల్. అయితే తమ మీదే దాడి జరుగుతోంది అనుకున్నప్పుడు అండ కోసం మీడియాని ఆశ్రయించే పరిస్దితిలు ఉన్నాయి. ఇప్పుడు బోయపాటి అదే పనిచేయబోతున్నట్లు సమాచారం.

వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యి వివాదం ముసురుకున్న నేపధ్యంలో గత కొద్ది రోజులుగా బోయపాటి శ్రీను, నిర్మాత దానయ్య మధ్య వివాదం జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్స్ కు వచ్చిన నష్టాలును ఎంతో కొంత భరిద్దామని ప్రపొజల్ పెట్టిన రామ్ చరణ్ డెసిషన్ గొడవలు తెచ్చి పెట్టింది. ఆ గొడవ ఇప్పుడు పెద్దదై..నిర్మాత దానయ్య ,బోయపాటి ఎదురెదురుగా నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకునేదాకా వెళ్లింది. అయితే ఇద్దరిలో ఎవరూ మీడియా ముందుకురాలేదు. సోషల్ మీడియా జోలికి పోలేదు. 

కానీ బోయపాటి తో వివాదం ఓ కొలిక్కి రాలేదు. చిరంజీవి, అల్లు అరవింద్ పరిష్కరిద్దామని చూసినా ఫలితం కనపడలేదు. ఈ నేపధ్యంలో దానయ్య వెనక్కి డబ్బు కట్టాల్సిందే అని పట్టుబడుతూండటం,   లెటర్ ఇచ్చి మరీ రామ్ చరణ్ తనని విలన్ గా చిత్రీకరించారని ఫీలవుతున్నారట. 

అలా ఎందుకు చేసారో సమాధానం చెప్తే తాను డబ్బు రికవరీ గురించి మాట్లాడతాను అంటున్నాడట. అయితే అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని భావించిన బోయపాటి త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారని మీడియా వర్గాల్లో వినపడుతోంది. అయితే మీడియా ముందుకు వస్తే అల్లరి అవుతుందని శ్రేయాభిలాషులు బోయపాటిని ఆపుతున్నారట. కానీ పీఆర్వో తో మాట్లాడి..ప్రెస్ మీట్ పెట్టాలనే పట్టుదలతో బోయపాటి ఉన్నారని వినికిడి.