Asianet News TeluguAsianet News Telugu

`వినరో భాగ్యము విష్ణుకథ` ట్రైలర్‌.. అమ్మాయి కోసం కిరణ్‌ అబ్బవరం, మురళీ శర్మ పోటీ..

కిరణ్‌ అబ్బవరం జయాపజయాలకు అతీతంగా దూసుకుపోతున్నాడు. వఇప్పుడు ఆయన్నుంచి వస్తోన్న మరో మూవీ `వినరో భాగ్యము విష్ణుకథ`. ఈ చిత్ర ట్రైలర్‌ని సాయిధరమ్‌ తేజ్‌ విడుదల చేశారు.

vinaro bhagyamu vishnukatha trailer released by sai dharam tej it create interest on movie
Author
First Published Feb 7, 2023, 7:36 PM IST

యంగ్‌ హీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. జయాపజయాలకు అతీతంగా దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన్నుంచి వస్తోన్న మరో మూవీ `వినరో భాగ్యము విష్ణుకథ`. మురళీ కిషోర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరణ్‌ అబ్బవరంతోపాటు కాశ్మీర పరదేశీ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఏ2 పిక్చిర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. 

ఈ చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మెగా సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ ట్రైలర్‌ని విడుదల చేశాడు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ట్రైలర్‌ చూస్తే, దర్శన (కాశ్మీర పరదేశి) అనే తెలియని అమ్మాయి నుండి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా విష్ణు (కిరణ్ అబ్బవరం) విధి మార్చబడింది. అప్పుడు ఆమె అతనిని ఎలా చేరుకుందో, మురళీ శర్మ పోషించిన మరొక పాత్రను నంబర్ నైబరింగ్ ద్వారా వివరిస్తుంది. ఈ ముక్కోణపు ప్రేమకథ లో కిరణ్‌ అబ్బవరం.. మురళీ శర్మతో పోటీ పడటం నవ్వులు పూయిస్తుంది.  ప్రేమ, ఫన్, ఎంటర్టైన్మెంట్ మేళవింపుగా ఉంది. 

అదేవిధంగా, విష్ణు తన పొరుగువారితో కనెక్ట్ అయినప్పుడు, అతని జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రశాంతంగా, కంపోజ్‌గా ఉండే  విష్ణు లైఫ్ చాలా ఇబ్బందుల్లోపడుతుంది. నెంబర్‌కి మరోవైపు యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు ఉన్నాయి. అమ్మాయి ప్రమాదంలో పడటం, దాన్ని హీరో ఎలా డీల్‌ చేశాడనేలా సాగుతుంది. మరి ఈ రెండింటికి లింక్‌ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఉంది. సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.  ఈ ట్రైలర్ కి బాక్గ్రౌండ్ స్కోర్ తోడై నెక్ట్స్ లెవల్‌కి తీసుకువెళ్లింది. ట్రైలర్‌లోని కొత్త, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ సినిమాపై అంచనాలను పెంచుతుంది. 

ఇందులో హీరో కిరణ్ అబ్బవరం యాక్షన్, రొమాన్స్, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. పండుగకు ఇది సరైన ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం ఈ నెల 17న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ ను ఇప్పటికే  ప్రారంభించారు, 'వినరో భాగ్యము విష్ణు కథ' లోని ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అందర్నీ ఆకట్టుకోగా, ఈ సినిమాలో మేకర్స్ అందిస్తున్న ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే చిత్రాల్లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. ఇందులో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డేనియల్ విశ్వాస్ ఫోటోగ్రఫీ దర్శకుడు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.

Follow Us:
Download App:
  • android
  • ios