ఒక హీరోయిన్ ఎన్నో ఆశలతో స్టార్ హీరోలతో కలిసి సినిమా చేస్తే.. ఆమూవీ టీమ్ వల్లే తనకు అన్యాయం జరిగితే ఎంత బాధగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ హీరోయిన్ వాణి భోజన్ (Vani Bhojan) ఇదే పరిస్థితి ఫేస్ చేస్తోంది.
ఒక హీరోయిన్ ఎన్నో ఆశలతో స్టార్ హీరోలతో కలిసి సినిమా చేస్తే.. ఆమూవీ టీమ్ వల్లే తనకు అన్యాయం జరిగితే ఎంత బాధగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ హీరోయిన్ వాణి భోజన్ (Vani Bhojan) ఇదే పరిస్థితి ఫేస్ చేస్తోంది.
పాపం వాణి భోజన్ (Vani Bhojan) సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. టెలివిజన్ స్టార్ గా ఎదిగిన ఆమె..వెండితెరపై కూడా మెరిపించాలనిచూసింది కాని తన ఆశల మీద నీళ్లు చల్లారు విక్రమ్ టీమ్. తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్(Vikram) రీసెంట్ గా నటించిన సినిమా మహాన్. ఈమూవీలో విక్రమ్ తనయుడు యంగ్ హీరో ధృవ్ విక్రమ్ కూడా తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యింది. యంగ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ఈసినిమా తెరకెక్కింది.
ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీ నడుస్తోంది. ఈసినిమా మొత్తం చూసిన ఆడియన్స్ కు ఒక విషయంలో మాత్రం షాక్ అయ్యారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ వాణి భోజన్(Vani Bhojan) అస్సలు ఒక్క ఫ్రేమ్‌లో కూడా కనిపించకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. దీంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశచెందారు.
తమిళ బుల్లితెరపై వాణి(Vani Bhojan) కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటు సినిమాల పరంగా కూడా ఆమెకు తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా విజయ్ దేవరకొండ నిర్మించిన మీకుమాత్రమే చెపుతా సినిమాతో.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ జోడీగా వాణి అలరించింది. మహాన్ లో ఇంపార్టెంట్ రోలో కోసం వాణీ భోజన్(Vani Bhojan)ను తీసుకున్నారు మేకర్స్. అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే కాకుండా వాణీతో విక్రమ్ కలిసి ఉన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. సెట్స్ నుంచి ఆమె విక్రమ్‌తో ఉన్నపిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల వాణి పాత్రను సినిమా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.
రన్‌టైమ్ ప్రోబ్లమ్ వల్ల ఈమూవీ నుంచి వాణిని తీసేసి ఉంటారు అని తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఆమె మహాన్ 2లో బాగం కాబోతుంది. అందుకే ఇందులో పాత్ర కట్ అయ్యింది అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మహాన్ మూవీ దాదాపు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్ తో సాగింది. వాణి పాత్రను కూడా చేర్చితే అది మూడు గంటలు అవుతుంది. అందుకే వాణి పాత్రను కట్ చేశారనిసమాచారం. ఇంత పెద్ద సినిమాలో నటించి ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించకపోవడంతో వాణి భోజన్ (Vani Bhojan) డిస్సపాయింట్ అయినట్టు తెలుస్తోంది.
