Asianet News TeluguAsianet News Telugu

పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్.. పవర్ స్టార్ కి ఆ మూవీ పడి ఉంటేనా!


దర్శకుడు రాజమౌళి ఓ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ ని సంప్రదించాడు. పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ కథను వేరే హీరోతో చేసి రాజమౌళి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ చిత్రం ఏమిటో తెలుసా?
 

vikramarkudu movie rajamouli supposed to do with hero pawan kalyan ksr
Author
First Published Aug 22, 2024, 11:14 AM IST | Last Updated Aug 22, 2024, 11:14 AM IST

దర్శకధీరుడు రాజమౌళి రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో చేసింది 12 చిత్రాలు మాత్రమే. గత 9 ఏళ్లలో రాజమౌళి మూడు సినిమాలు చేశారు. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను ఏళ్ల తరబడి తెరకెక్కించాడు. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఆయన కాంప్రమైజ్ అవ్వడు. అందుకే రాజమౌళి సినిమాలు చెప్పిన సమయానికి విడుదల కావు. అలాగే రాజమౌళి చేసిన హీరోలతోనే రిపీటెడ్ గా చిత్రాలు చేశారు. కొందరు స్టార్ హీరోలతో ఒక్క చిత్రం కూడా చేయలేదు. 

అత్యధికంగా ఎన్టీఆర్ తో రాజమౌళి నాలుగు సినిమాలు చేశాడు. తర్వాత ప్రభాస్ తో మూడు సినిమాలు చేశాడు. రామ్ చరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు చేశారు. నాని, రవితేజ, సునీల్ తో ఒక్కో చిత్రం చొప్పున చేశాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు. మహేష్ బాబుతో మూవీ కన్ఫర్మ్ అయ్యింది. రాజమౌళి తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్నారు. 

కాగా పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబోలో ఓ చిత్రం మిస్ అయ్యింది. అది పడితే పవన్ కళ్యాణ్ కి సరికొత్త ఇమేజ్ సొంతం అయ్యేది.పవన్ కళ్యాణ్ తో మూవీపై గతంలో రాజమౌళి స్పందించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. నేను కూడా ప్రయత్నం చేశాను. ఒకసారి పవన్ కళ్యాణ్ ని కలిసి స్క్రిప్ట్ కథ వినిపించాను. బాగుంది మళ్ళీ కలుద్దామని ఆయన అన్నారు. 

అనంతరం ఒకటి రెండుసార్లు నేను పవన్ కళ్యాణ్ ని కలిసే ప్రయత్నం చేశాను. పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అలా మా ఇద్దరి కాంబోలో మూవీ కార్యరూపం దాల్చలేదు, అని రాజమౌళి అన్నారు. కాగా పవన్ కళ్యాణ్ కి రాజమౌళి వినిపించింది విక్రమార్కుడు కథ అట. పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే విక్రమార్కుడు చిత్రం ఆయనతో చేయాలని రాజమౌళి భావించారట. కొంత కాలం వేచి చూసిన రాజమౌళి ఆ ప్రాజెక్ట్ రవితేజతో చేశాడు. 

2006లో విడుదలైన విక్రమార్కుడు భారీ విజయం అందుకుంది. రవితేజకు జంటగా అనుష్క శెట్టి నటించింది. రవితేజ కెరీర్ కి విక్రమ్ మార్కుడు హిట్ బాగా ప్లస్ అయ్యింది. మాస్ లో ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. రవితేజ మార్క్ కామెడీ సినిమాకు హైలెట్. డ్యూయల్ రోల్ లో రవితేజ ఆకట్టుకున్నాడు. కీరవాణి సాంగ్స్ అలరించాయి. మరి ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి పడితే కథ వేరేలా ఉండేది.. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios