తాను ఎన్నిసార్లు సంప్రదించినా, విక్రమ్ రెస్పాండ్ కాలేడని చెప్పారు. ఆయన నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో రాహుల్ భట్ ను హీరోగా తీసుకున్నట్లు చెప్పారు.
కల్ట్ క్లాసిక్స్ అయిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్', 'అగ్లీ', 'గులాల్' మరియు 'నో స్మోకింగ్' చిత్రాలను రూపొందించిన దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఆయన తన తదుపరి చిత్రం 'కెన్నెడీ'. ‘కెన్నెడీ‘ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక అయ్యింది. మిడ్‌నైట్ స్క్రీనింగ్ కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ మూవీ ప్రీమియర్ త్వరలోనే జరగనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న ఆయన, ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ తమిళ స్టార్ హీరో విక్రమ్ పై కామెంట్స్ చేసారు.
కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా బాలీవుడ్ పాపులర్ వెబ్ సైట్ ఫిల్మ్ కంపానియన్ తో అనురాగ్ మాట్లాడుతూ.....వాస్తవానికి ఈ సినిమాను రాహుల్ భట్ తో చేయాలి అనుకోలేదన్నారు. తను హీరోగా మరొకరిని ఊహించుకుని ఈ సినిమా కథను రాసినట్లు చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అనే పేరును కూడా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్. విక్రమ్ అసలు పేరు కెన్నెడీ. ఆయనను హీరోగా భావించి ఈ సినిమాను రూపొందించనున్నారు కాబట్టి ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అని పేరు పెట్టానని చెప్పారు. కథ రెడీ అయ్యాక విక్రమ్ ను సంప్రదించినట్లు అనురాగ్ చెప్పారు. అయితే, తాను ఎన్నిసార్లు సంప్రదించినా, విక్రమ్ రెస్పాండ్ కాలేడని చెప్పారు. ఆయన నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో రాహుల్ భట్ ను హీరోగా తీసుకున్నట్లు చెప్పారు.
ఈ విషయమై విక్రమ్ స్పందించారు. సోషల్ మీడియాలో మా స్నేహితులు మరియు శ్రేయోభిలాషుల కోసం ఒక సంవత్సరం క్రితం నుండి మా కాన్వర్షేషన్ ని మళ్లీ గుర్తు చేస్తున్నాను అన్నారు. ఈ చిత్రం కోసం మీరు నన్ను సంప్రదించడానికి ప్రయత్నించారని మరియు నేను మీకు స్పందించలేదని మీరు భావించారని మరొక నటుడి నుండి నేను విన్నప్పుడు, నేను వెంటనే మీకు కాల్ చేసాను. మీ నుండి నాకు మెయిల్‌గా ఎటువంటి మెయిల్ లేదా మెసేజ్ రాలేదని వివరించాను. మీరు నన్ను సంప్రదించిన ఐడి ఇప్పుడు యాక్టివ్‌గా లేదు మరియు దాదాపు 2 సంవత్సరాల ముందు నా నంబర్ మారిపోయింది అని చెప్పాను. ఆ ఫోన్ కాల్ సమయంలో నేను చెప్పినట్లు, మీ కెన్నెడీ సినిమా కోసం నేను చాలా ఎగ్జైట్‌గా ఉన్నాను మరియు దానికి నా పేరు ఉంది కాబట్టి. అంటూ చెప్పుకొచ్చారు.
‘కెన్నెడీ’ చిత్రంలో రాహుల్ భట్, సన్నీ లియోన్, అభిలాష్ తప్లియాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ నిద్రలేమితో బాధపడుతున్న ఒక మాజీ పోలీసు చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని స్టోరీతో ఈ మూవీ రూపొందింది. అనురాగ్ కేన్స్ 2023లో తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూనే ఉన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు సంబంధించి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు.
