లోక నాయకుడు కమల్ హాసన్ దిల్ ఖుష్ అవుతున్నారు... ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న కమల్ మూవీ కెరీర్ లో విక్రమ్ రిజల్ట్ తో పండగవాతావరణం వచ్చినట్టు అయ్యింది.  

సుమారు నాలుగయిదేళ్ళ తరువాత లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. వచ్చి రావడంతోనే సూపర్ హిట్ సినిమాతో తనలో ఇంకా సత్తా అయిపోలేదని నిరూపించాడు. ఆడియన్స్ తో పాటు అభిమానులను కూడా దిల్ ఖుష్ చేశాడు కమల్. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య లాంటి స్టార్స్ డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించి మెప్పించారు. 

 జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ మూవీ ఓవర్ ఆల్ గా దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్‌ హాసన్‌ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకూ చూసిన కమల్ హాసన్ ఒక ఎత్తు.. ఇప్పుడు చూస్తున్న కమల్ ఒక ఎత్తు అన్నట్టుగా.. తనలోని కొత్త యాంగిల్ ను ఈసినిమాలో చూపించాడు లోక నాయకుడు. అంతే కాదు ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీన్స్ తో అదరగొట్టాడు.. అద్బుతం చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓ టీటీలో కూడా అదే రేంజ్ లో దుమ్ము రేపుతుండటం విశేషం. 

ఈనెల 8న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజైన విక్రమ్‌ సినిమా అక్కడ కూడా తన సత్తా చాటుకుంటోంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో దుమ్ము రేపి దంచికొడుతోంది. అంతే కాదు అన్ని భాషల్లో విక్రమ్ మూవీ ఓటీటీలో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ వీకెండ్‌ సాధించిందని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ నుంచి ఓ ప్రకట రిలీజ్ అయ్యింది. విక్రమ్ మూవీ. ఇప్పటివరకు ఉన్న ఓపెనింగ్‌ వ్యూస్ రికార్డును తిరగరాసిందని తెలిపారు. 

ఇంకా హైయెస్ట్‌ స్ట్రీమింగ్‌తో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విక్రమ్ సినిమా టాప్ లో నిలిచింది. దాంతో ఫ్యాన్స్ తో పాటు కమల్ హాసన్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ విషయంలో కమల్ హాసన్ స్వయంగా స్పందించారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ద్వారా విక్రమ్‌ ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి సక్సెస్ ను తనకు అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కు ప్రత్యేకంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు విక్రమ్ కోసం పనిచేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.