`పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంలోని వీరి ఫస్ట్ లుక్‌లను విడుదల చేసింది యూనిట్‌. హిస్టారికల్‌ గెటప్‌లో ఉన్న కార్తి, విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిషల ఫస్ట్ లుక్‌లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 

మణిరత్నం(Maniratnam) రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక హిస్టారికల్‌ చిత్రం `పొన్నియిన్‌ సెల్వన్‌`(Ponniyin Selvan.1). మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన `పొన్నియిన్‌ సెల్వన్‌` చాలా రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది కల్కీ కృష్ణమూర్తి రాసిన `పొన్నియిన్‌ సెల్వన్‌` అనే నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మణిరత్నం. దీనికి భారీ కాస్టింగ్‌ తోడైంది. విక్రమ్‌, కార్తి, జయంరవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి భారీ తారాగణం నటిస్తుంది. 

తాజాగా ఈ చిత్రంలోని వీరి ఫస్ట్ లుక్‌లను విడుదల చేసింది యూనిట్‌. హిస్టారికల్‌ గెటప్‌లో ఉన్న కార్తి, విక్రమ్‌, జయంరవి, ఐశ్వర్యరాయ్‌, త్రిషల ఫస్ట్ లుక్‌లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. గూస్‌బమ్స్ తెప్పిస్తున్నాయి. పీరియాడికల్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం వీరి ఫస్ట్ లుక్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇందులో ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే కుండవై పిరట్టియార్ గా త్రిష నటిస్తున్నారు. ఆయా పాత్రలని ఆడియెన్స్ కి పరిచయం చేశారు మణిరత్నం. 

Scroll to load tweet…

మరోవైపు ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని కూడా ఫిక్స్ చేసింది యూనిట్‌. సెప్టెంబర్‌ 30 ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు మణిరత్నం. అందులో భాగంగా మొదటి భాగం సెప్టెంబర్‌ 30న విడుదల చేయబోతున్నారు. అయితే దీన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కించడం విశేషం. దీంతో పాన్‌ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల చేయబోతున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. 

`పొన్నియిన్‌ సెల్వన్‌` మూవీ ప్రధానంగా 10వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందట. చోల రాజవంశం చుట్టూ కథ సాగుతుందని, రాజ్యాన్ని హస్త గతం చేసుకోవడానికి కుటుంబాల మధ్య జరిగిన సమరం నేపథ్యంలో సినిమాని రూపొందిస్తున్నట్టు సమాచారం. చరిత్రలో దాగిన వీరుల కథకు ఫిక్షనల్ అంశాలని జోడించి ఈ చిత్రాన్ని మణిరత్నం తనదైన స్టయిల్‌లో తెరకెక్కిస్తున్నారు.