టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ఆ కథ కోలీవుడ్ లో కూడా సిద్ధమైంది. విక్రమ్ తనయుడు  ధృవ్ నటించిన ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. 

ఆ పనులు కూడా రేపో మాపో ఎండింగ్ కి వచ్చేస్తాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక డేట్ పై చిత్ర యూనిట్ విక్రమ్ తో చర్చలు జరిపింది. సెప్టెంబర్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు అనువైన సమయమని ఆ డేట్ కి పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో సినిమాను విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. 

త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన గిరీశయ ఆదిత్య వర్మను రీ షూట్ చేశాడు. మొదట బాల తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సినిమా అవుట్ ఫుట్ పై ఓ లుక్కేసిన విక్రమ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది.