సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి తరువాత నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఆయనపై బడా దర్శకుల చూపు ఉంది. ఇక టాలీవుడ్ లో నాగార్జునకి విజయేంద్ర ప్రసాద్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. 

రీసెంట్ గా బాహుబలి రచయితను కలిసిన నాగ్ తన పెద్ద కొడుకు కోసం ఒక కథను సెట్ చేయమని చెప్పినట్లు సమాచారం. వరుసగా శైలజా రెడ్డి అల్లుడు - సవ్యసాచి సినిమాలతో దెబ్బతిన్న నాగ చైతన్యకు ఇప్పుడు హిట్టు చాలా అవసరం. ప్రస్తుతం తన సతీమణి సమంతతో కలిసి ఒక రొమాంటిక్ లవ్ కథతో బిజీగా ఉన్నాడు.

ఆ లవ్ స్టోరీని నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా తరువాత చైతు విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో నటించే అవకాశం ఉంది. ఇక కథ మొత్తం పూర్తవ్వగానే నాగార్జున ఒక సీనియర్ దర్శకుడికి ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించనున్నట్లు టాక్.