అయోధ్య రామమందిరంపై విజయేంద్రప్రసాద్‌ సినిమా.. హీరో ఎవరంటే?

ఇప్పుడు అయోధ్య రామమందిరం సినిమా రాబోతుంది. దిగ్గజ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

vijayendra prasad movie plan on ayodhya ram mandir who will act hero?

అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఒక గొప్ప గట్టంగా భారతీయులు భావిస్తున్నారు. గర్వించే క్షణాలుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పోరాటం, నిర్మాణం, ప్రారంభం అద్భుతంలా వర్ణిస్తున్నారు మతతత్వ, ఆథ్యాత్మిక వాదులు. మొత్తానికి అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట ఘనంగా జరిగింది. దేశం మొత్తం ఆ గొప్ప దైవ క్షణాలను ఆస్వాధించింది. ప్రపంచం కూడా ఇటువైపు చూసేలా ఈ రామ మందిరం ప్రారంభోత్సవం జరగడం విశేషం. 

ఇదిలా ఉంటే ఇప్పుడు అయోధ్య రామమందిరం సినిమా రాబోతుంది. దిగ్గజ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయోధ్య రామమందిరంపై సినిమా తీస్తున్నట్టు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చీవేత నుంచి రామ మందిరం ఏర్పాటు వరకు ఈ సినిమా ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు ఇందులో నటించే ముఖ్య పాత్ర కోసం కూడా ఆయన సంప్రదింపులు జరిపారట. బాలీవుడ్‌ లో ఫైర్‌ బ్రాండ్‌గా నిలిచిన కంగనా రనౌత్‌తో చర్చించినట్టు విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. 

ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, అన్ని కుదిరితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ని మున్ముందు అందిస్తామని విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ఇందులో ఇందిరా గాంధీ పాత్రకి కంగనాని అడిగినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ స్టార్‌ రైటర్‌ గతంలో `ఆర్‌ఎస్‌ఎస్‌`పై కూడా సినిమాని ప్రకటించారు. ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారట. దీనికి సంబంధించిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నుంచి అనుమతి కూడా తీసుకున్నారని, దీనికి తనే దర్శకత్వం వహిస్తానని తెలిపారు. 

దీనికి సంబంధించిన నిర్మాణ సంస్థ కూడా సినిమాని తీసేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్టోరీ తనని ఎంతో ఇన్‌స్పైర్‌ చేసిందని, అందుకే సినిమాగా తీస్తున్నట్టు చెప్పారు. అయితే ఇది డాక్యుమెంటరీలాగా ఉండదని, ప్రాపర్‌ కమర్షియల్‌ అంశాలతో తీయబోతున్నట్టు చెప్పారు. మాస్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయబోతున్నట్టు వెల్లడించారు విజయేంద్రప్రసాద్‌. 

ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వం వహించే మహేష్‌ బాబు ఫిల్మ్ `ఎస్‌ఎస్‌ఎంబీ29`కి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట. మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్‌ ఈ మూవీకి సంబంధించిన మేకోవర్‌లో, బాడీ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే విజయేంద్రప్రసాద్‌ రాజ్యసభ ఎంపీగా నయమితులైన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు రాజ్యసభ సీటుని ఆఫర్‌ చేసింది. ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నారు. కానీ ఇటీవల ప్రారంభమైన రామమందిరం ప్రారంభోత్సవానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం గమనార్హం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios