సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి మొదటి నుండి ఓ వర్గం నుండి వ్యతిరేకత ఎదురవుతూనే ఉంది. ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు ఈ సినిమా విడుదల ఆపాలని ఈసీకి, కోర్టుకి ఫిర్యాదులు చేశారు. 

అవన్నీ దాటుకొని సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో కంప్లైంట్ నమోదైంది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ రద్దు చేయాలని హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయవాడకి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీ, చంద్రబాబును కించపరిచేలా ఈ సినిమాలో సీన్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేశారు. మరి దీనిపై సెన్సార్ బోర్డ్ ఎలా స్పందిస్తుందో చూడాలి!