ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి చాలా కాలం తరువాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఆమె ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. 

విజయశాంతి కూడా త్వరలోనే చిత్ర యూనిట్ తో కలవనుంది. అయితే ఆ లోపు న్యూ లుక్ లో కనిపించాలని ఆమె జిమ్ లో కష్టపడుతున్నారు. పాత్రకు తగ్గట్టు కనిపించాలని ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన తరువాత ఫిట్ నెస్ ని దూరం పెట్టిన విజయశాంతి చాలా కాలం తరువాత మహేష్ సినిమా కోసం సరికొత్త లుక్ కోసం శ్రమిస్తున్నారు. 

దాదాపు 13 ఏళ్ల తరువాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకోనున్నారు. చివరగా విజయశాంతి నటించిన చిత్రం నాయుడమ్మ. 2006లో వచ్చిన ఆ చిత్ర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ సినిమా ద్వారా లేడి సూపర్ స్టార్ ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.