సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని పాటలను, ట్రైలర్ లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది.

ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలు విజయానందంలో ఉండగా వచ్చే పాట అది. ''విజయం విజయం ఘన విజయం.. విజయం విజయం శుభ సమయం'' అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్ పాత్రధారి.. ''నీలాంటి వ్యక్తిని పట్టుకొని ఎన్ని నిందలు మోపారు.. వాళ్లందరికీ ఈ ఘన విజయం ఓ గొప్ప చెంపదెబ్బ''అంటూ లక్ష్మీపార్వతితో చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించారు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, మోహన భోగరాజు ఈ పాటను ఆలపించారు. ఈ సినిమాను మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.