విజయకాంత్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో అంశాలు కొంచెం ఆందోళన కలిగించేలా ఉన్నాయి. మరో 14 రోజుల వరకు చికిత్స అవసరం అని తెలియజేశారు.  

నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ నవంబర్ 18న మియత్ ఆసుపత్రిలో చేరారు. జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఆసుపత్రిలో చేరారు. పది రోజులుగా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైద్యులు విజయకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హెల్త్ బులెటిన్ లో వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతూనే 24 గంటలుగా సమస్యలు తలెత్తాయి. కొద్ది మేర పల్మనరీ సపోర్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. మరో 14 రోజుల చికిత్స అవసరం. ఆయన పూర్తిగా కోలుకుంటారనే విశ్వాసం ఉందని వైద్యులు ప్రకటలో వెల్లడించారు. హెల్త్ బులెటిన్ ప్రకారం కొంచెం ఇబ్బందికరంగానే ఆయన కండిషన్ ఉందని అర్థం అవుతుంది. 

విజయ్ కాంత్ ప్రస్తుత వయసు 71 ఏళ్ళు. కొన్నాళ్లుగా ఆయన తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటికే పరిమితం అవుతున్న విజయకాంత్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. విజయకాంత్ 90లలో స్టార్ హీరోగా ఉన్నారు. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మార్కెట్ ఉండేది. 

Scroll to load tweet…