లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి దాదాపు పదమూడేళ్ల త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్...ఇప్పుడు మహేష్ సినిమా  సరిలేరు నీకెవ్వరు తో రీఎంట్రీ ఇస్తూండటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి దాదాపు పదమూడేళ్ల త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌లోకి రీఎంట్రీ ఇస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్...ఇప్పుడు మహేష్ సినిమా సరిలేరు నీకెవ్వరు తో రీఎంట్రీ ఇస్తూండటం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇక అభిమానులు అయితే తెలుగు సినిమాల్లో రాములమ్మ రచ్చ మళ్లీ మొదలవ్వబోతోందని ఆనందపడిపోతున్నారు. 

ఈ నేపధ్యంలో విజయశాంతి వరసపెట్టి సినిమాలు చేయబోతారంటూ వార్తలు మొదలయ్యాయి. తాజాగా మరో వార్త టాలీవుడ్ ని ఆశ్చర్యంలో పడేసింది. అది రాజమౌళి సైతం ఆమెను తన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ లోకి తీసుకోబోతున్నారని. ఎన్టీఆర్ చేసే కొమురం భీమ్ పాత్రకు సంభందించిన ఎపిసోడ్ లో ఈ రాములమ్మ కనపడుతుందని చెప్తున్నారు. అయితే ఇది కేవలం రూమరా లేక నిజంగానే రాజమౌళి తీసుకున్న నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది. 

'ఆర్ఆర్ఆర్' విషయానికి వస్తే.. కొంత కాలం క్రితం హీరోలిద్దరూ గాయపడటంతో 'ఆర్ఆర్ఆర్' షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు అన్నీ సెట్ రైట్ చేసుకుని ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ హైద్రాబాద్‌లోనే మొదలెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాల్గొనే సీన్స్ రీటేక్ అనేది లేకుండా చాలా స్పీడుగా పూర్తి చేస్తున్నారట. ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా కాలం పాటు చెప్పుకునేలా ఉంటుందంటున్నారు.