ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ రెండు మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. వాటిలో క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమొకటి.  రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్‌, క్యాథరిన్‌, ఇజబెల్లిలు నటిస్తున్న  ఈ చిత్రం చాలా రోజులుగా షూటింగ్‌ జరుపుకుంటోంది.  రిలీజ్‌  డేట్ ఇప్పిటిదాకా ప్రకటించలేదు.

దాంతో ఈ మూవీ గురించి సినిమాపై అనుమానాలు రేకెత్తాయి.  ఈ నేపధ్యంలో  చిత్ర నిర్మాత తాజాగా ఓ అప్‌డేట్‌ను ప్రకటించాడు. ఈ మూవీ టైటిల్‌ను ఈ రోజు (సెప్టెంబర్‌ 17) ఉదయం 11గంటలకు రివీల్‌ చేయనున్నుట్లు తెలిపాడు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి బ్రేకప్ అనే టైటిల్ ని ఖరారు చేసారని తెలుస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్. ఆ టైటిల్ తో ఈ రోజు పోస్టర్ వదలనున్నారు.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.  డియర్ కామ్రేడ్ డిజాస్టర్  కావడంతో ఈ చిత్రం విజయ్ కెరీర్‌కు కీలకంగా మారింది.  మరో ప్రక్క మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు సినిమా తర్వాత సరైన హిట్  లేని క్రాంతి మాధవ్.. కూడా ఈ సినిమా సక్సెస్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్నారు. యూత్ ని టార్గెట్ చేసే ఈ చిత్రం ప్రేమలు, విడిపోవటాలు, నిజమైన ప్రేమ ని తెలుసుకోవటం చుట్టూ తిరగనుందని సమాచారం.