తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ ఏసుదాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కేరళలోని అలప్పుళలో ఆయన సోమవారం రాత్రి విజయ్ ప్రయాణిస్తోన్న కారు మరో కారును ఢీకొంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు. కొచ్చి నుంచి తిరువనంతపురం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి విజయ్‌తో పాటు ఆయనను ఢీకొన్న మరో వాహనంలోని వారు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే విజయ్ కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది. తాను సురక్షితంగా ఉన్నట్లు విజయ్ వెల్లడించారు.
తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు కార్లు ముందు భాగంలో నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం తర్వాత విజయ్, అతని స్నేహితుడు మరో కారులో కోచికి వెళ్లిపోయారు.
ఏసుదాస్ వారసుడిగా సంగీత ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఏసుదాస్.. 20 ఏళ్లుగా పలు భాషల్లో పాడారు. అలాగే మారి మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి పడైవీరన్‌లో మెరిశారు. ప్రస్తుతం విజయ్ సాల్మాన్ అనే మల్టీలింగ్వల్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మలయాళంలో గాయకులకు సరైన గుర్తింపు లేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు విజయ్. ఇక తాను మలయాళ చిత్రాల్లో పాటలు పాడనని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ పాటలు పాడతానని ఈ సందర్భంగా తెలిపారు.
