Asianet News TeluguAsianet News Telugu

`వారసుడు` తగ్గలేదట.. రావడం పక్కా..

విజయ్‌ హీరోగా నటిస్తున్న `వారసుడు` చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. అయితే తెలుగులో ఇది కాస్త లేట్‌గా రిలీజ్‌ అవుతుందనే ప్రచారం జరిగింది. దీనిపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

vijay vaarasudu movie release date in telugu no delay
Author
First Published Jan 7, 2023, 7:42 PM IST

దళపతి విజయ్‌ నటించిన `వారసుడు` చిత్రం సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది. తెలుగు దర్శకుడు వంశీపైడిపల్లి రూపొందించిన చిత్రమిది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 11న సినిమాని తమిళం, తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం నిర్ణయించింది. తెలుగులో చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`, బాలకృష్ణ `వీరసింహారెడ్డి` చిత్రాలు సంక్రాంతి  సందర్భంగానే రిలీజ్‌ కాబోతుంది. దీంతో థియేటర్ల సమస్య ప్రధానంగా తలెత్తుతుంది. 

`వారసుడు` చిత్రానికి థియేటర్లని పెద్ద ఎత్తున కేటాయించారు చిత్ర నిర్మాత దిల్‌రాజు. తన సొంతంగానే చాలా థియేటర్లున్న నేపథ్యంలో ఆయన తన సినిమాకే కేటాయించారు. దీంతో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తుతుంది. దీంతో ఇది టాలీవుడ్‌లో పెద్ద హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే చివరి నిమిషంలో దిల్‌రాజు వెనక్కి తగ్గాడని, `వారసుడు` సినిమాని మూడు రోజుల ఆలస్యంగా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వినిపించింది. 

`వారసుడు` తమిళంలో 11నే రిలీజ్‌ కాబోతుందని, కానీ తెలుగులో మాత్రం జనవరి 14న రిలీజ్‌ చేయాలని భావించారనే ప్రచారం జరిగింది. చిరంజీవి, బాలయ్యలతో ఉన్న రిలేషన్‌ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్‌ వచ్చింది. కానీ ఇందులో నిజం లేదట. `వారసుడు` వాయిదా వేయడం దిల్‌రాజు లేదని చెప్పారు. తాను ఏక కాలంలో `వారసుడు` తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. `వారసుడు` అనుకున్న సమయానికే తెలుగులో రిలీజ్‌ కానుంది. విజయ్‌ రావడం పక్క అని తెలుస్తుంది. 

ఇక వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే భారీ రేట్‌కి నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడుపోయినట్టు సమాచారం. రిలీజ్‌కి ముందే దిల్‌రాజు సేఫ్‌లో ఉన్నారని సమాచారం. అంతేకాదు సినిమా రిజల్ట్ పై కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. అయితే `వారసుడు` ట్రైలర్‌ చూస్తుంటే `అజ్ఞాతవాసి`, `అత్తారింటికి దారేది`, `శ్రీమంతుడు` వంటి ఛాయలు కనిపిస్తున్నాయనే నెట్టింట టాక్‌ వినిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios