కొన్ని కాంబినేషన్లు.. ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోయి ఉంటాయి. ఎప్పటికీ అలానే ఉండిపోయి ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో  విజయ్ , జ్యోతికల కాంబో కూడా ఒకటి. తమిళనాట సూపర్ హిట్ అయిన ఈ కాంబో... మళ్లీ 20 ఏళ్ల తరువాత కలవబోతోందట.  

తమిళనాట విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఫ్యాన్స్ బేస్ ఎంత ఉందో అందరికి తెలిసిందే. అయితే విజయ్ తో కొంత మంది హీరోయిన్ల కాంబినేషన్.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నలిచిపోయి ఉంటుంది. అందులో జ్యోతికతో కలిసి విజయ్ చేసిన సినిమాలు ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేదు. ముఖ్యంగా తమిళ ఖషి సినిమాలో వీరిద్దరి జోడి.. కెమిస్ట్రీ అద్భుతమని చెప్పాలి. తెలుగులో పవర్ స్టార్, భూమికల కాంబోలో ఖుషి సినిమా ఎంత హిట్ అయ్యిందో... అంతకంటే ముందే విజయ్, జ్యోతికల కాంబోలో తమిళ ఖుషి సినిమా అంతకు రెండింతలు ప్రభావం చూపించింది. అంతే కాదు ఆ సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి.. ఉంటాయి. వీరి జోడీకి కూడా ఆసినిమాతో మంచి పేరు వచ్చింది. 


ఇక ఖుషీ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న విజయ్- జ్యోతిక ఆతరువాత తిరుమలై సినిమాలో చేశారు. ఈ సినిమా కూడా అప్పట్లో కమర్షియల్‌గా భారీ హిట్టుకొట్టింది. ఆతరువాత వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక వీరి కాంబినేషన్ కలవడానికి 20 ఏళ్ళు పట్టింది. ఇక తాజాగా ఈ జంట ముచ్చటగా మూడో సారి తెరపై కనిపించనున్నారని చెన్నై ఫిల్మ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్‌. కాకపోతే ఈసారి ఆమె విజయ్ జోడీగా నటించడం లేదట . ప్రస్తుతం విజయ్‌, వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో జ్యోతిక కీలకపాత్ర పోషించనుందట. 

ఇప్పటికే దర్శకుడు కథ చెప్పడం.. చర్చించుకోవడం.. ఈ పాత్రకు జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా అయిపోయిందట. కథా చర్చలు కూడా ముగిసాయని టాక్. తిరుమలై సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20ఏళ్లు అవుతుంది. రెండు దశాబ్ధాల తరువాత వీళ్లద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఈ విషయం తెలిసి విజయ్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక విజయ్‌ మరోవైపు లియో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా పండుగను లాక్‌ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. 

అంతే కాదు సంజయ్‌ దత్‌ విలన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది. త్రిష కూడా విజయ్ తో గతంలో హిట్ సినిమాలు చేసింది. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యింది అనుకుంటే.. గ్లామర్.. ఫిట్ నెస్ తో.. దుమ్మురేపుతోంది. పొన్నియన్ సెల్వన్ తో .. రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక జ్యోతిక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె మమ్ముట్టితో కలిసి నటించిన కాథల్ సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. దీనితో పాటుగా హిందీలో శ్రీ, బ్లాక్‌ మేజిక్‌ సినిమాలు చేస్తుంది.