లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ శాంతి ...తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. ఈ మధ్య గ్యాప్ లో చాలా మంది ట్రై చేసారు . కానీ వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు ఆమె మహేష్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెకు కథ, క్యారక్టరైజేషన్ చెప్పి ఒప్పించినట్లు చెప్పుకుంటున్నారు. 

వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా ఎఫ్ 2 తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన తరువాత సినిమాను మహేష్  బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే.   జూలై నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఈ నేపద్యంలో ఈ చిత్రంలో నటించబోయే ఆర్టిస్ట్ లను ఫైనలైజ్ చేస్తున్నారు. 

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట, అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ సరసన గీతా గోవిందం చిత్రంతో  సెన్సేషనల్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. విజయ శాంతి ఈ ప్రాజెక్టుకు సైన్ చేయటం అనేది కనుక నిజమే అయితే ఖచ్చితంగా మంచి క్రేజ్ వస్తుంది. ఆ క్రేజే సినిమాకు ప్లస్ అవుతుంది. ఏమంటారు..