విజయ్ సేతుపతిపై దాడి చేసిన వ్యక్తి ఎవరు? విజయ్‌ని ఎందుకు టార్గెట్‌ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. 

తమిళ నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupati)పై దాడి జరిగింది. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఈ ఘటన కలకలం సృష్టిస్తుంది. Vijay Sethupatiపై దాడి చేసిన వ్యక్తి ఎవరు? విజయ్‌ని ఎందుకు టార్గెట్‌ చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…

ఇటీవల కన్నడ పవర్ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే పునీత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలు దేరారు విజయ్‌ సేతుపతి, ఫ్లైట్‌ లో ఆయన Banglore Airport కి చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్ నుంచి విజయ్‌ సేతుపతి బయటకు వస్తున్న నేపథ్యంలో వెనకాల నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి విజయ్‌ సేతుపతిని తన్నినట్టు వీడియోలో తెలుస్తుంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. 

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.. ఆ దాడి విజయ్‌ సేతుపతిపై కాదని, అతని వద్ద ఉన్న అనుచరుడిపై చేసిన దాడి అని తెలుస్తుంది. విజయ్‌ వెనకాల అతను ఉండటంతో, అతన్ని తన్నడం వల్ల విజయ్‌ సేతుపతిపై పడటంతో విజయ్‌ ముందుకు తుళ్లారు. వెంకట్‌ అనే వ్యక్తి, విజయ్‌ సేతుపతి అనుచరుడికి ఫ్లైట్లోనే గొడవ జరిగిందట. ఆ గొడవ పెరగడంతో ఇలా బయటకు వెళ్తున్న క్రమంలో అతనిపై వెంకట్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో దాడి చేశారని సమాచారం. ఇది తనపై కాదని, తన అనుచరుడిపై అని విజయ్‌ సేతుపతి కూడా వివరణ ఇచ్చినట్టు ఓ వార్త వినిపిస్తుంది. 

అంతేకాదు ఈ దాడి చేసిన ఘటనలో వెంకట్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ వారి మధ్య నెలకొన్న వివాదాన్ని విజయ్‌ సేతుపతి పరిష్కరించారడని, రాజీకుదిర్చారని ఇద్దరికి సర్ది చెప్పినట్టు సమాచారం. వివాదం ముగిసిందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక విజయ్‌ సేతుపతి `సైరా నర్సింహరెడ్డి`, `ఉప్పెన` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. `ఉప్పెన`లో ఆయన నటన అందరిని కట్టిపడేసింది. 

also read: Puneeth Rajkumar: పునీత్ కుటుంబానికి రాంచరణ్ పరామర్శ.. సొంత ఫ్యామిలీ మెంబర్, భావోద్వేగంతో..

ప్రస్తుతం ఆయన తమిళం, మలయాళం, హిందీ కలుపుకుని దాదాపు పది చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో కమల్‌ హాసన్‌ `విక్రమ్`, నయనతార, సమంతలు నటిస్తున్న `కాథు వాకుల రెండు కాదల్‌`, `విదుతలై` చిత్రాలు చేస్తున్నాడు. దీంతోపాటు `గాంధీ టాక్స్` పేరుతో ఓ సైలెంట్ చిత్రం చేస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి ఓ వైపు హీరోగా, మరోవైపు బలమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
also read: Lala Bheemla: దీపావళి ముందుగానే తీసుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌..