Asianet News TeluguAsianet News Telugu

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసిన విజయ్ సేతుపతి... అప్పటి ఆయన కష్టాలు వింటే...

నటుడుగా అనేక మైలు రాళ్లు అందుకున్న విజయ్ సేతుపతి ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక కష్టాలు పడ్డారు. చదుకునే రోజులలో విజయ్ సేతుపతి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసేవారట.

Vijay sethupathy revealed once he worked in a fast food center ksr
Author
Hyderabad, First Published Jul 17, 2021, 11:16 AM IST

వర్సిటైల్ నటుడు విజయ్ సేతుపతి ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియా స్టార్ గా పలు బాషలలో నటిస్తున్నారు. ఓ ప్రక్క హీరోగా చిత్రాలు చేస్తూనే మరో ప్రక్క విలన్ రోల్స్ కూడా చేస్తున్నారు. నటుడుగా అనేక మైలు రాళ్లు అందుకున్న విజయ్ సేతుపతి ఈ స్థాయికి చేరుకోవడానికి అనేక కష్టాలు పడ్డారు. చదుకునే రోజులలో విజయ్ సేతుపతి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసేవారట.

ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసి, రాత్రికి అక్కడే తినేవాడట. ఖర్చులకు అవసరమైన డబ్బుల కోసం అక్కడ చాలా కాలం పనిచేశారట విజయ్ సేతుపతి. ఇక వంట చేయడం విజయ్ సేతుపతికి చాలా ఇష్టం అట. సాయంత్రం స్నాక్ గా ఉల్లిపాయ సమోసా తినడానికి ఇష్టపడతాడట.

విజయ్ మాస్టర్, ఉప్పెన చిత్రాలలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశాడు. ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, విజయ్ సేతుపతి నటనకు ప్రశంసలు దక్కాయి. లోకేష్ కనకరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్నారు. మరో టాలెంటెడ్ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios