Asianet News TeluguAsianet News Telugu

“మాస్టర్” హిందీ రీమేక్: హీరో,విలన్ ఎవరంటే...

సినిమా టాక్ కు సంభందం లేకుండా ఈ మూడు రోజులూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్.  అయితే ఇప్పటికే సినిమాలో కీ పాత్రలైన హీరో,విలన్స్ ను ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.

Vijay Sethupathi will be repeating his villainous act JSP
Author
Hyderabad, First Published Jan 17, 2021, 7:54 AM IST

దళపతి విజయ్‌, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌సేతుపతి నటించిన చిత్రం 'మాస్టర్‌'. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై మంచి వసూళ్లను సాధిస్తోంది. సినిమా టాక్ కు సంభందం లేకుండా ఈ మూడు రోజులూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్.  అయితే ఇప్పటికే సినిమాలో కీ పాత్రలైన హీరో,విలన్స్ ను ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది.

బాల నేరస్థులతో నేరాలు చేయించే విలన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించగా, ఆ పిల్లలను సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నించే మాస్టర్‌ పాత్రలో విజయ్‌ నటించారు. సినిమాలో చాలా క్యారక్టర్స్  ఉన్నప్పటికీ, ఈ రెండు పాత్రలు మధ్యనే ఎక్కువ సినిమా రన్‌ అవుతుంది.  విజయ్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌.. విజయ్‌ సేతుపతి రోల్‌లో తననే నటింప చేయాలని బాలీవుడ్‌ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తుండటంతో తనతోనే ఈ పాత్రను చేయిస్తే బావుంటుందని భావిస్తున్నారట.  
 
ఇక ఈ సినిమాని హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసారు.  కానీ ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు అస్సలు లేక్క వెయ్యలేదు. హిందీ వెర్షన్ కు  ఎంత దారుణమైన కలెక్షన్స్ అంటే..  ఇండియా మొత్తం ఈ సినిమా రెండు రోజులకుకలిపి 35 లక్షలు రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు హిందీలో ఎలాగూ ఎవరూ చూడడడం లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మురాద్ కేతాని, ఎండోమెల్ ఇండియా కలిసి రీమేక్ చేస్తామని ప్రకటించాయి.   

చిత్రం కథేమిటంటే...జేడీ (విజయ్) ఓ ప్రొఫెసర్. సెయింట్‌ జేవియర్ కాలేజ్‌లో పనిచేస్తూ అక్కడ విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ కు కారణం అవుతాడు. ఆ ఎన్నికల్లో గొడవలు జరగడంతో బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వరేషన్‌ హోమ్‌కి మాస్టర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఆ హోమ్‌ని అడ్డుపెట్టుకుని భవాని (విజయ్ సేతుపతి) అరాచకాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇంతకీ భవాని ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? జేడీ అక్కడి పరిస్థితిని ఎలా చక్కబెట్టాడు. భవానీని ఎలా అడ్డుకున్నాడు? చారు (మాళవిక) ఎవరు?జేడీ జీవితంలో ఆమె స్థానం ఏంటి? అనేదే కథ!

Follow Us:
Download App:
  • android
  • ios