తమకు హిట్  ఇచ్చిన డైరక్టర్స్ కు హీరోలు గిప్ట్ లు  ఇవ్వడం అనేది వింతమీ కాదు. అలాగే తనకు '96' వంటి భారీ సక్సెస్ ని అందించినందుకు గాను ప్రేమ్ కుమార్ కు విజయ్ సేతుపతి బుల్లెట్ ను బహుమానంగా ఇచ్చాడట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘96’. త్రిష హీరోయిన్. ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా తమిళంలో సూపర్‌హిట్‌ అయ్యింది.  బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. 

ఇలాంటి హిట్   సినిమాను తనకిచ్చిన ప్రేమ్‌ కుమార్‌కు ధాంక్స్ చెబుతూ విజయ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను‌ కానుకగా ఇచ్చారు. ఆ బైక్‌ విలువ రూ.3 లక్షలని తెలుస్తోంది. అంతేకాదు విజయ్‌ ‘0096’ అనే నంబరుతో బైక్‌ను రిజిస్ట్రేషన్‌ కూడా చేయించినట్లు చెబుతున్నారు. విజయ్‌కు బైక్‌లంటే ఇంట్రస్ట్ అని, ప్రత్యేకించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అంటే ‌ఇష్టమని తెలుసుకునే విజయ్ సేతుపతి ఆ పనిచేసాడంటున్నారు.

స్కూలు వయసులో ప్రేమలు ఎలా ఉంటాయి? వాటిని ఒకరికొకరు చెప్పుకోలేక విడిపోవడం.. పెరిగి పెద్దయ్యాక రీయూనియన్ ద్వారా కలుసుకున్నప్పుడు వారి మనోభావాలు ఎలా ఉంటాయి? తదితర విషయాలను ఈ సినిమాలో దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ‘96’ సినిమాను తెలుగులోనూ రీమేక్‌ చేస్తున్నారు. 

ఇందులో శర్వానంద్‌, సమంత జంటగా నటించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. మాతృకను తీసిన ప్రేమ్‌ కుమార్‌ రీమేక్‌ను కూడా తెరకెక్కించబోతున్నారు. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. 

ఇక విజయ్‌ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. మెగాస్టార్  చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లో విజయ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విజయ్‌.. రజనీకాంత్‌కు విలన్ గా నటించిన ‘పేట’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది.