`నా అభిమానులను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఈ ఘటన జరిగినంత మాత్రానా నేను మారను. అభిమానులను కలుస్తూనే ఉంటాను` అని స్పష్టం చేశాడు విజయ్‌ సేతుపతి. హిందూ మక్కల్‌ కట్చి సంస్థపై ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఆసక్తి నెలకొంది.

విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi)పై బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ పై దాడి ఘటన ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి సంబంధించిన హిందూ మక్కల్‌ కట్చి సంస్థ చేసిన ప్రకటన మరింత దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై Vijay Sethupathi స్పందించారు. తనకు సెక్యూరిటీ గార్డులను ఇష్టం ఉండదని చెప్పాడు. `నాకు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ నా స్నేహితుడితోనే ప్రయాణిస్తాను. అతను నాకు ముప్పై ఏళ్లుగా తెలుసు. ఇప్పుడు అతను నాకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. నా అభిమానులను కలవడానికి, మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఈ ఘటన జరిగినంత మాత్రానా నేను మారను. అభిమానులను కలుస్తూనే ఉంటాను` అని స్పష్టం చేశాడు. హిందూ మక్కల్‌ కట్చి సంస్థపై ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఆసక్తి నెలకొంది.

ఇక దాడి జరిగిన రోజు విజయ్ సేతుపతి స్పందిస్తూ, అది చాలా చిన్న ఘటన, దాడి జరగడానికి ముందే ఆ వ్యక్తి గత సిబ్బందితో గొడవపడ్డాడు. విమానం ఎయిర్‌ పోర్ట్ లో విమానం ల్యాండ్‌ అయ్యాక కూడా ఇది కొనసాగింది. ఆ సమయంలో మద్యం సేవించాడు. అందుకే మతిస్థిమితం కోల్పోయి ఆ విధంగా ప్రవర్తించాడు. వీడియోలు వైరల్‌ కావడంతో జనాలు దీన్ని పెద్ద సమస్యగా చేస్తున్నారు. అయినా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ ఫిల్మ్ మేకర్ అయిపోతున్నారు` అని ఘాటుగా స్పందించారు. ఇటీవల కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ మరణం అనంతరం ఆయన ఫ్యామిలీని పరామర్శించేందుకు విజయ్‌ సేతుపతి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఇదిలా ఉంటే విజయ్‌ సేతుపతిని తంతే 1001 రూపాయలు ఇస్తామని ప్రకటించింది హిందూ మక్కల్‌ కట్చి సంస్థ నిర్వహకులు. హిందూ మక్కల్‌ కట్చి అనే సంస్థ విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి రూ. 1001 బాహుబతిగా ఇస్తామని ప్రకటించి దుమారం రేపుతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్‌ ముత్తురామలింగ తేవర్‌ అయ్యని, దేశాన్ని అవమానించేలా వ్యాఖ్యానించాడని, దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లని పోస్ట్ చేసింది. `తేవర్ అయ్యని అవమానించిందుకు విజయ్‌ సేతుపతిని తన్నినందుకు హిందూ మక్కల్‌ కట్చి సంస్థకి చెందిన అర్జున్‌ సంపత్‌ నగదు బహుమతిని ప్రకటించారు. విజయ్‌ సేతుపతిని ఒక్క కిక్కి రూ.1001 ఇస్తామని ప్రకటించాడ`ని హిందూ మక్కల్ కట్చి పేర్కొంది. 

దీనిపై అర్జున్‌ సంపత్ మాట్లాడుతూ, తాను ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజమే అని, విజయ్‌ సేతుపతిని తన్నడానికి ప్రయత్నించిన వ్యక్తి మహాగాంధీతో తాను మాట్లాడానని, విజయ్‌ సేతుపతి అతనితో చాలా హేళనగా మాట్లాడాడని, అది వాగ్వాదానికి దారి తీసిందన్నారు. `విజయ్‌ సేతుపతికి జాతీయ అవార్డు వచ్చినందుకు అతను విషెస్‌ చెప్పాలనుకున్నాడని, కానీ విజయ్‌ వ్యంగ్యంగా స్పందించాడని, అసలు ఇది దేశం కాదన్నాడని తెలిపాడు. మీరు సౌత్‌ నుంచి వచ్చారు. పసుంపోన్‌కు హాజరు కావాలని పిలవగా, ప్రపంచంలో ఏకైకా దేవుడు జీసస్‌ మాత్రమే అని విజయ్‌ చెప్పాడని, అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడ`ని అర్జున్‌ సంపత్‌ తెలిపారు. అందుకే తాను ఈ నగదు బహుమతి ప్రకటించినట్టు తెలిపిన విషయం తెలిసిందే. 

also read: Vijay Sethupathi: విజయ్‌ సేతుపతిని తంతే 1001 బహుమతి.. నెట్టింట దుమారం..