నిహారిక పెళ్లి తరువాత విడుదలవుతున్న మొట్టమొదటి మూవీ 'ఓ మంచిరోజు చూసి చెప్తా'. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా నిహారిక నటిస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఓ మంచిరోజు చూసి చెప్తా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి కొమ్ములు కలిగిన తలపాగా ధరించి రాజును తలపిస్తున్నాడు. ఇక నిహారిక మహారాణి గెటప్ లో ఉండడం విశేషం. 


చడీచప్పుడు లేకుండా ఈ మూవీ రావడం నిహారిక మరియు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచి వేసింది. నిహారిక వివాహానికి ముందే ఈ మూవీలో నటించారని సమాచారం. తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. ఇక ఇటీవల విడుదలైన ఉప్పెన మూవీలో విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రిగా విలన్ రోల్ చేశారు. ఉప్పెన భారీ విజయం సాధించగా, ఆయన ఇమేజ్ మరింతగా పెరిగింది. 


ఉప్పెనలో మెగా హీరో వైష్ణవ్ కి విలన్ గా నటించిన విజయ్ సేతుపతి, నిహారికకు జంటగా నటించడం విశేషత సంతరించుకుంది. దీనితో పాటు నిహారిక ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేశారు. ఈ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సిరీస్ నందు అనసూయ మరో లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రానికి ఆరుముగ కుమార్ దర్శకత్వం వహించగా, రావూరి వెంకటస్వామి నిర్మించారు.