మూవీని ఇప్పుడు తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాలు తరువాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా 

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరుశురాం డైరెక్ట్ చేస్తున్నారు. గతంలో విజయ్ అండ్ పరుశురాం కాంబినేషన్ లో ‘గీతగోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం విజయ్ అండ్ పరుశురాం బాగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చి ఉంటారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఈ సినిమాకు 50 దాకా బడ్జెట్ అయ్యింది. ఎక్కువ వర్కింగ్ డేస్ అవ్వటం వలన ఆ బడ్జెట్ కు రీచ్ అయ్యింది. అలాగే ఈ సినిమాకు విజయ్ దేవరకొండకు 15 కోట్లు దాకా ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ 12 కోట్లు దాకా తీసుకునేవారు. కానీ ఈ సినిమాకు మూడు కోట్లు పెంచి తీసుకున్నట్లు వినికిడి.

ఈ చిత్రం వచ్చే వారం ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మూవీని ఇప్పుడు తెలుగు అండ్ తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. రెండు వారాలు తరువాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ మూవీ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 45 కోట్ల వరకు జరుగుతున్నట్లు సమాచారం. గీతగోవిందంతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకోవడంతోనే.. ప్రస్తుతం విజయ్ ప్లాప్స్ లో ఉన్న ఇంతటి బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. 

ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. ఇక ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని సమాచారం. గతంలో గీతగోవిందం సక్సెస్ మీట్ కి చిరంజీవి హాజరయ్యి విజయ్ ని అభినందించారు. ఇప్పుడు మూవీ రిలీజ్ కి ముందే వచ్చి విజయ్ ని అభినందించడం కోసం రాబోతున్నారని తెలుస్తోంది. అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రాలేదు.

అలాగే ఈ చిత్రం కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. మధ్యతరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, బాధ్యతలను, అలాగే ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్ళాడు అనే విషయాలను పరుశురాం మార్క్ ఎంటర్టైనింగా చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే గీతగోవిందంతో పోలిస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది.