దళపతి విజయ్ తెలుగు సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. వంశీ పైడిపల్లి మూవీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈమూవీ నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.  

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక మందన్న జంటగా వంశీపైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతోనన పాన్ ఇండియా మూవీ షూటింగ్ పరుగులు పెడుతోంది. వంశీ పైడిపల్లి ఈమూవీని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో విజయ్ అండ్ టీమ్ తో లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు పైడిపల్లి. 

ఇక ఈమూవీ నుంచి రీసెంట్ గా విజయ్, రష్మిక ,వంశీ పైడిపల్లి షూటింగ్ చేస్తోన్న ఫోటోలు లీక్ అయ్యాయి.ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లోకి ఈ ఫోటోలు చేరిపోవడంతోఈ సినిమా దర్శకుడు వంశీ అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇకపై షూటింగ్ సమయంలో లోకేషన్ లోకి ఎవరికీ ఫోన్ అనుమతించకూడదన్న ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

విజయ్ 66 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.ఈ షూటింగ్ లో... రోడ్డు పక్కన నర్సరీలో వేసిన షూటింగ్ సెట్ లో విజయ్ క్యాజు వల్ డ్రెస్ వేర్ లో కనిపించగా.. రష్మిక పొట్టి టాప్ తో వెనుకనే నించున్నట్టు కనిపిస్తోంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఆసక్తిగా చూస్తున్నట్టు ఫోటోలో స్పస్టంగా కనిపిస్తుంది.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వంశీ రూపొందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విజయ్, రష్మికలతో పాటు ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, యోగి బాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2023 ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ చయాలి అని చూస్తున్నారు.