Asianet News TeluguAsianet News Telugu

విజయ్ దేవరకొండ డబుల్ ప్రమోషన్ ప్లాన్స్!

ఈ సినిమాపై ఇప్పటికే ట్రైలర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని మరింత పెంచాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అంటే ముందుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల ప్రమోషన్స్ బాగా క్లిక్ అయ్యాయి.

vijay nota double promotions
Author
Hyderabad, First Published Sep 26, 2018, 6:58 PM IST

చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త ధనం ఉండేలా చూసుకునే విజయ్ దేవరకొండ నోటా సినిమాలో కూడా అదే స్టైల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే ట్రైలర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని మరింత పెంచాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. 

విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ అంటే ముందుంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల ప్రమోషన్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఇకపోతే మనోడి రేంజ్ ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అవ్వడంతో రెండు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించే విధంగా నోటా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. విజయవాడలో సెప్టెంబర్ 30న  హైదరాబాద్ లో అక్టోబర్ 1న ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

ఇక ఈ ఈవెంట్స్ కు 'ద నోటా పబ్లిక్ మీట్' అని టైటిల్ సెట్ చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా పాలిటిక్స్ తరహాలో నిర్వహిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ నిర్మిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios