కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత నెంబర్ 2గా కొనసాగుతున్న ఇలయథలపతి విజయ్ నెక్స్ట్ ప్రయోగాత్మకమైన కథలతో రాబోతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా స్పీడ్ గా షూటింగ్ పనులను ముగించుకోవాలని చూస్తున్నాడు. మెర్సల్ - సర్కార్ సినిమాల తరువాత విజయ్ స్థాయి పెరిగింది. 

200కోట్ల బిజినెస్ చేయగల సత్తా ఉన్న సౌత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో కూడా సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. బాలీవుడ్ లో అమిర్ ఖాన్ చిన్న బడ్జెట్ సినిమాలు చేసి కూడా తన మార్కెట్ ని ఒక లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇటీవల విజయ్ కూడా లోకేష్ కానగరాజ్ అనే యువ దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వీలైనంత తక్కువ బడ్జెట్ లో సినిమాను ఫినిష్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట.

అలాగే సినిమా షూటింగ్ కూడా 50రోజుల్లో పూర్తవ్వాలని టార్గెట్ గా  పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ అట్లీ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లోకేష్ తో విజయ్ ఎలాంటి సినిమా చేస్తున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.