మరోసారి ;కోలీవుడ్ హీరో విజయ్ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. సినిమా కథ నాదే అంటూ ఒక షార్ట్ ఫిల్మ్ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. ప్రతిసారి విజయ్ సినిమాలపై ఎదో ఒక విధంగా కేసులు పుట్టుకొస్తున్నాయి. మెయిన్ కథలు కాపీ కొట్టారంటూ ఆరోపణలు వస్తున్నాయి. 

గతంలో వచ్చిన కత్తి (తెలుగులో రీమేకైన ఖైదీ నెంబర్ 150) నుంచి విజయ్ సినిమా కథలకు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. తేరి - సర్కార్ సినిమా కథలు  కూడా కొట్టేశారంటూ అప్పట్లో పలువురు రచయితలు కోర్టుకు వెళ్లారు. ఇక ఇప్పుడు ఇంకా టైటిల్ కూడా సెట్ చేయని విజయ్ 63 సినిమా కథ నాదేనంటూ సెల్వ అనే వ్యక్తి చెన్నై సెషన్స్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. 

ఈ కేసును కోర్టు 23న విచారించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఒరిజినల్ ఫుట్ బాల్ స్టేడియం సెట్ వేయిస్తున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం.