ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు వసూలు చేసినట్టు కోలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహం, ధైర్యంతో అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వారు ..ఈ నెల 29 న విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

  ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీత దర్శకులు. అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల అయ్యింది.
 
వాస్తవానికి మాస్టర్ పోయిన సమ్మర్‌లోనే విడుదకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా వాయిదా పడుతూ, వాయిదా పడుతూ చివరకు సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌ లో కొన్ని సడలింపులు ఇచ్చారు.

 దీంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. అయితే యాబైశాతం మాత్రమే టిక్కెట్స్‌ను అందుబాటులో ఉంచాలి. ఇన్ని కండిషన్స్ మధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన విజయ్ మాస్టర్ అందర్నీ అలరించలేకపోయింది. మాస్టర్ కేవలం విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రమే అంటూ టాక్ బయటకు వచ్చింది.