లోకేష్ కనకరాజు డైరెక్షన్‌లో తమిళ్‌లో తెరకెక్కిన సినిమా తెలుగు, హిందీలో డబ్ అయింది. బాలీవుడ్‌కు డబ్ అయినా సరే రీమేక్ చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్.
తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్. గత కొన్నేళ్లుగాగా ఆయన నటించిన సినిమాలు ఏకకాలంలో తమిళం, తెలుగులో విడుదలవుతూ వస్తున్నాయి. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంచుకునే కథలు, సినిమాలు ఇక్కడి ప్రేక్షకులనూ అలరిస్తున్నాయి. అయితే సరైన హిట్ మాత్రం పడటం లేదు. తాజాగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘మాస్టర్’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యంగా ఈ సంక్రాంతికి థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో విజయ్ నటన ఎలా ఉంది అనేదాని కన్నా ‘ఖైదీ’తో క్రేజ్ సంపాదించిన లోకేశ్ కనకరాజ్ విజయ్‌ను ఎలా చూపించారు అనే దానిపైనే జనాలందరి దృష్టీ ఉంది. అలాగే విలన్ గా గా విజయ్ సేతుపతి ఎలా చేసారు?అనేదాని కోసం ఆసక్తిగా చూసారు. అయితే సినిమాకు అనుకున్నంత టాక్ రాలేదు. కానీ ప్రీ రిలీజ్ బజ్ మూలంగా కలెక్షన్స్ లోటు లేదు.
ఇక ఈ సినిమాని హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమాని హిందీ ప్రేక్షకులు అస్సలు లేక్క వెయ్యలేదు. హిందీ వెర్షన్ కు ఎంత దారుణమైన కలెక్షన్స్ అంటే.. ఇండియా మొత్తం ఈ సినిమా రెండు రోజులకుకలిపి 35 లక్షలు రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు హిందీలో ఎలాగూ ఎవరూ చూడడడం లేదు కాబట్టి దీన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మురాద్ కేతాని, ఎండోమెల్ ఇండియా కలిసి రీమేక్ చేస్తామని ప్రకటించాయి. బాలీవుడ్‌కు డబ్ అయినా సరే రీమేక్ చేస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేయటంతో అందరూ ఆశ్చర్యపోయారు.కొందరు నవ్వుకుంటున్నారు. ఎండమోల్ షైన్ ఇండియా, సినీ వన్ స్టూడియోస్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా హిందీలో సినిమాను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాయి. నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్. మరి ఏం చూసి ఈ సినిమాని రీమేక్ చెయ్యాలనుకుంటన్నారో చూడాలి.
చిత్రం కథేమిటంటే...జేడీ (విజయ్) ఓ ప్రొఫెసర్. సెయింట్ జేవియర్ కాలేజ్‌లో పనిచేస్తూ అక్కడ విద్యార్థి సంఘాల ఎలక్షన్స్ కు కారణం అవుతాడు. ఆ ఎన్నికల్లో గొడవలు జరగడంతో బాల నేరస్థుల స్టేట్ అబ్జర్వరేషన్ హోమ్‌కి మాస్టర్‌గా వెళ్లాల్సి వస్తుంది. ఆ హోమ్‌ని అడ్డుపెట్టుకుని భవాని (విజయ్ సేతుపతి) అరాచకాలకు పాల్పడుతూ ఉంటాడు. ఇంతకీ భవాని ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? జేడీ అక్కడి పరిస్థితిని ఎలా చక్కబెట్టాడు. భవానీని ఎలా అడ్డుకున్నాడు? చారు (మాళవిక) ఎవరు?జేడీ జీవితంలో ఆమె స్థానం ఏంటి? అనేదే కథ!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 16, 2021, 10:51 AM IST