Vijay Master Movie : రిపిట్ కాబోతున్న మాస్టర్ కాంబినేషన్...? ముచ్చటగా ఆ ముగ్గురు..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) దూసుకుపోతున్నారు. తమిళంతో పాటు టాలీవుడ్ ను కూడా టార్గెట్ చేశాడు విజయ్. ఇక తనకు హిట్ ఇచ్చిన కాంబినేషన్ ను మరోసారి రిపిట్ చేయబోతున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) దూసుకుపోతున్నారు. తమిళంతో పాటు టాలీవుడ్ ను కూడా టార్గెట్ చేశాడు విజయ్. ఇక తనకు హిట్ ఇచ్చిన కాంబినేషన్ ను మరోసారి రిపిట్ చేయబోతున్నాడు.
స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) – మక్కల్ సెల్వమ్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కాంబినేషన్ లో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన సినిమా మాస్టర్. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. మురగదాస్ తరువాత తమిళ్ లో ఆ స్థాయిలో వినిపిస్తున్న పేరు లోకేశ్ కనగరాజ్. ఈ యంగ్ డైరెక్టర్ కార్తి హీరోగా తెరకెక్కించిన ఖైదీ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులోను సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఆయన చేసిన మాస్టర్ కూడా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసింది.
ఈ సినిమాలో హీరోగా విజయ్ .. విలన్ గా Vijay Sethupathi అద్బుతంగా నటించారు. సినిమాలో నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. విజయ్ తో పాటు సమానమైన క్రేజ్ ను విజయ్ సేతుపతికి కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. మరి అలాంటి కాంబినేషన్ మళ్లీ కలిస్తే.. ఫ్యాన్స్ కు పండగే. ఇప్పుడు ఇదే నిజం అయ్యేలా కనిపిస్తోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబో మరో సినిమా రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా లోకేష డైరెక్షన్ లోనే సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే లోకేశ్ కనగరాజ్ అటు విజయ్ కి .. Vijay Sethupathi కథ వినిపించడం వారిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని సమాచారం. నిర్మాతగా కలైపులి థాను నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి.
ఈ క్రేజీ కాంబినేషన్ కోసం కోలీవుడ్ ఫ్యాస్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీజ్ డైరెక్షన్ లో బీస్ట్ సినిమా చేశారు. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు Vijay. తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారు. అటు విజయ్ సేతుపతి కూడా ఇటు తెలు.. అటు తమిళ సినిమాలతో మంచి జోర మీద ఉన్నాడు.