‘మాస్టర్’:అమేజాన్ ఎంత పెట్టి కొనుక్కుందో తెలిస్తే మైండ్ బ్లాక్
విజయ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాస్టర్’. ఖైదీ సినిమాతో స్టార్ డైరక్టర్ గా ఎదిగిన లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా మొన్న సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. తెలుగు వెర్షన్ కొంచెం అటూ ఇటూ అనిపించినా ...తమిళ వెర్షన్ మాత్రం సూపర్ హిట్టైంది. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వారు ..ఈ నెల 29 న అంటే ఈ రోజు నుంచి విడుదలచేసారు.
రిలీజై పదిహేను రోజులు మాత్రమే అయిన ఈ సినిమా ఓటీటిలో అప్పుడే రావటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అభిమానులకు అయితే చాలా భాదను కలిగించింది. అయితే నిర్మాతలు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకు కారణం ఈ సినిమాకు అమేజాన్ వారు పే చేసిన ఎమౌంటే అని తెలుస్తోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మాస్టర్’ డిజిటల్ రైట్స్ ని 36 కోట్లు పే చేసి సొంతం చేసుకుందని సమాచారం. మొదట ఈ చిత్రానికి 20 కోట్లు ఇస్తామని ముందుకు వచ్చారు. అయితే ప్రీమియర్ చూసిన తర్వాత మరో పదహారు కోట్లు పెంచి ఈ రేటు ఇచ్చారు. అప్పుడు చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం రిలీజైన 15 రోజుల్లో స్ట్రీమ్ చెయ్యాలి. ఇప్పుడు అమేజాన్ వారు అదే చేస్తున్నారు.
కరోనా దెబ్బతో ఓవర్ సీస్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దాని నుంచి కోలుకోవటానికి ఈ డిజిటల్ రైట్స్ ఉపయోగపడతాయంటున్నారు. అలాగే అమేజన్ ప్రైమ్ కూడా తమ ఓటీటికు ఈ సినిమా స్ట్రీమింగ్ తో భారీగా సబ్ స్కైబర్స్ పెరుగుతాయని భావిస్తోంది. అలాగే వ్యూయర్ షిప్ కూడా ఖచ్చితంగా బాగుంటుందని అంచనా వేస్తున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.200 కోట్ల మేరకు వసూలు చేసినట్టు కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహం, ధైర్యంతో అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన మాళవికా మోహన్ నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకులు. అర్జున్ దాస్, సిమ్రన్, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎక్స్‌బీ ఫిల్మ్స్, సెవన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల అయ్యింది.