‘లియో’వరల్డ్ వైడ్ 'ప్రీ రిలీజ్ బిజినెస్' డిటేల్స్ (ఏరియావైజ్)
‘విక్రమ్’లాంటి సూపర్‌హిట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్’ తర్వాత లోకేశ్- విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘లియో’ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో మూపై భారీగా హైప్ క్రియేట్ చేశాయి. లియో తెలుగు పోస్టర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ కూల్‌గా, స్టైలిష్‌గా ఉన్న లుక్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ''నిశ్శబ్ధాన్ని పాటిస్తూ.. యుద్ధానికి దూరంగా ఉండండి'' అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయ్యింది. 228 కోట్ల వరకూ బిజినెస్ చేయబడింది అని చెప్పబడుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియా వైజ్ ఎంతకు అమ్ముండైందో చూద్దాం.
తమిళనాడు– 100Cr
కేరళ – 16 Cr
కర్ణాటక- 15Cr
తెలుగు రెండు రాష్ట్రాలు - 22 Cr
భారత్ లో మిగతా ప్రాంతాలు – 10Cr
ఓవర్ సీస్ – 65 Cr
మొత్తం థియేటర్ బిజినెస్ – 228 Cr
ఇక ఈ సినిమా రా వెర్షన్ (అన్‌కట్ వెర్షన్)ను యూకేలో విడుదల చేస్తున్నట్లు పంపిణీ సంస్థ అహింసా ఎంటర్‌టైన్‌మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు లోకేశ్ విజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక్క విజువల్ కూడా ప్రేక్షకులు మిస్‌కాకుడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాము ఊహించిన స్థాయిలో సినిమాకి స్పందన వచ్చిన తర్వాత 12A (12 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు) ఫ్రెండ్లీ వెర్షన్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.
థియేటర్లలో రిలీజ్ తర్వాత రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు కలెక్షన్లను ఈ మూవీ సాధించగలదని అంచనా. పాజిటివ్ టాక్ వస్తే 2.0 రికార్డును (రూ.810 కోట్లు) పైతం ‘లియో’ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘విక్రమ్’లాంటి సూపర్‌హిట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్’ తర్వాత లోకేశ్- విజయ్ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్. లియోలో యాక్షన్ కింగ్ అర్జున్ హెరాల్డ్ దాస్‌గా, సంజయ్ దత్ ఆంటోనీ దాస్‌గా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.